BJP: డిసెంబర్లోనే తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. ఆ నేత పేరు ఫైనల్!?

తెలంగాణ బీజేపీకి డిసెంబర్లో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, పాయల్ శంకర్ ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. హైకమాండ్ వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

New Update
Telangana BJP New Chief

Telangana BJP: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ ఎవరనే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా.. కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని అంతా భావించారు. కానీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో అది వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్లో తెలంగాణకు కొత్త బీజేపీ చీఫ్‌ ను నియమించడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీని ప్రకటించారు. రిటర్నింగ్ ఆఫీసర్ గా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను నియమితులయ్యారు. ఎన్నికలకు ముందు బూత్, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలను నియమించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్‌ ఎవరు అవుతారు? హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. 

Also Read :  లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

పోటీలో ఉన్నది వీరే..

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ పడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించిన ఈటల రాజేందర్ కు కేంద్ర మంత్రి పదవి పక్కా అన్న ప్రచారం సాగింది. బీసీ కోటాలో ఆయనకు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ హైకమాండ్ మాత్రం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు అవకాశం ఇచ్చింది. దీంతో ఈటలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అయినా అప్పగిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ఇప్పటివరకు అది జరగలేదు.

Also Read :  గ్యాంగ్ స్టార్‌ చోటా రాజన్‌ కు బెయిల్‌!

ఈటలకే ఛాన్స్..?

ప్రస్తుతం బీసీ కోటాలో ఈటలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న చర్చ పార్టీలో సాగుతోంది.  బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్షుడిగా తొలగించిన సమయంలోనూ ఈటల పేరే ప్రధానంగా వినిపించింది. కానీ సీనియర్ నేత కిషన్ రెడ్డిని హైకమాండ్ ఎంపిక చేసింది. దీంతో మళ్లీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో మళ్లీ ఈటల పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఈటలకు ఛాన్స్ ఇవ్వకపోతే.. ఫైర్ బ్రాండ్ గా పేరు ఉన్న రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అయితే.. వీరిలో ఒకరికి అవకాశం ఇస్తారా? లేదా మరో నేతను హైకమాండ్ ఎంపిక చేస్తుందా? అన్న అంశంపై  మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Also Read :  స్టార్ హీరోయిన్‌ కి బలవంతంగా ముద్దుపెట్టిన హీరో!

Also Read :  అనుష్క కాదు, కాజల్ కాదు.. ప్రభాస్ కి సరైన జోడీ ఈ హీరోయినే!

Advertisment
తాజా కథనాలు