/rtv/media/media_files/2025/07/30/nagarjuna-sagar-2025-07-30-19-57-18.jpg)
Nagarjuna Sagar
Nagarjuna Sagar : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. నాగర్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.20 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సుమారు 18 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ జలాశయంలో అద్భుతం ఆవిష్కృతమైందని చెప్పవచ్చు.
Telangana: Nagarjuna Sagar gates open after 18 years With massive inflows from upstream, the reservoir is full to the brim. Ministers Uttam Jumar Reddy & Adluri Laxman, along with officials, opened the crest gates to release floodwaters
— Deccan Chronicle (@DeccanChronicle) July 29, 2025
(Video courtesy : X)#NagarjunaSagar… pic.twitter.com/OJ1cFlRRHo
ఇది కూడా చూడండి:BIG BREAKING: వారందరి పెన్షన్లు కట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణమిదే!
తొలిసారి జులై మాసం పూర్తయ్యే నాటికే నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం విశేషమనే చెప్పాలి. దీంతో నిన్న తెలంగాణ మంత్రులు 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. జులై నెలలో నాగార్జున సాగర్ నిండటం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సాగర్ 13, 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తం 8 గేట్లు 8 ఫీట్లు పైకి ఎత్తి 68 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సాగర్10, 11, 12, 13, 14, 15, 16, 17 గేట్లు ఎత్తినట్లు వారు తెలిపారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నాగర్జున సాగర్ నిండు కుండలా మారిందని అధికారులు పేర్కొన్నారు. ఈ వరదలతో నీటిమట్టం గరిష్ఠ స్ధాయికి చేరుకుందన్నారు. ఈ మేరకు సాగర్ క్రస్ట్ గేట్లు ఇవాళ తెరుచుకున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టులో సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి మహారాష్ట్ర, కర్ణాటక సహా రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయానికి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో వరదలు పోటెత్తాయి. ఇక నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. అయితే ప్రస్తుతం 586.60 అడుగులకు చేరుకోవడంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చూడండి:TG New Ration Cards: కొత్త రేషన్‌కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ స్కీమ్స్ కూడా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
కృష్ణమ్మ ఉరకలెత్తి ప్రవహిస్తుండటంతో ఆ పరవళ్లను పరవళ్లను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతొ నాగార్జున సాగర్ పరిశరాల్లో సందడి నెలకొంది.