Telangana: నీటి పారుదల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..
నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, నీటి విడుదల అంశంపై చర్చించారు. సాగర్ నుంచి నీరు విడుదల చేసే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.