MLA Raj Gopal Reddy : రేవంత్ ఇకనైనా మారు.. రాజగోపాల్ రెడ్డి వార్నింగ్!

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపై నేరుగా సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు రాజగోపాల్ రెడ్డి మరో సంచలన ట్వీట్ చేశారు.

New Update
rajgopal

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపై నేరుగా సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు రాజగోపాల్ రెడ్డి మరో సంచలన ట్వీట్ చేశారు. నియోజకవర్గాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలన్నారు రాజగోపాల్ రెడ్డి. ఓ పేపర్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాసిన వ్యాసాన్ని సమర్థిస్తూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. 

Also read : TG Crime: ప్రాణం తీసిన పేకాట.. పోలీసులు రావడంతో పారిపోతుండగా హార్ట్ ఎటాక్!

మెజారిటీ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారంటూ తన ట్వీట్ లో తెలిపారు. బడా ప్రాజెక్టులు, బడా ఈవెంట్ల, బడా ప్రకటనలపై ఉన్న శ్రద్ధ... గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలపై ఉండట్లేదంటూ యెన్నం కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలకు చిన్న చిన్న పనుల విషయంలో విచక్షణాధికారం ఉండాలని యెన్నం తన వ్యాసంలో వ్యాఖ్యనించారు. యెన్నం కామెంట్స్‌ను సమర్థిస్తూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవం గ్రహించాలని హితవు పలికారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో  సంచలనంగా మారింది. 

అలాంటి ప్రచారాలను నమ్మకండి

ఇక తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని లేదా కొత్త పార్టీని స్థాపిస్తానని వస్తున్న వార్తలను  రాజగోపాల్ రెడ్డి ఖండించారు. తాను ఎందుకు రాజీనామా చేస్తానని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని పేర్కొన్నారు. ఈ ప్రచారాల వెనుక తన ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. మునుగోడు అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.  తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచానని, కోమటిరెడ్డి కుటుంబం అంటేనే కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. 

Also read : భారత సైన్యం మాపై దాడులు చేసింది.. లష్కరే తోయిబా కమాండర్ కీలక వ్యాఖ్యలు

కాగా మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేదని, యువతను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

Also Read :Diwali Xiaomi Sale 2025: దీపావళికి షియోమి బంపర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, పవర్‌బ్యాంక్స్‌పై కిర్రాక్ ఆఫర్లు..

Advertisment
తాజా కథనాలు