Komatireddy: సీఎం రేవంత్ భాష మార్చుకోవాలి..మరో బాంబు పేల్చిన MLA కోమటిరెడ్డి-VIDEO

సీఎం రేవంత్ రెడ్డి తన బాషను మార్చుకోవాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు.

New Update
komatireddy

Komatireddy

Komatireddy: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.  ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఎటాక్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన సీఎం రేవంత్ పైన సంచలన కామెంట్స్ చేశారు. 

Also Read: రేవంత్ రెడ్డి మోసం చేశారు.. రోడ్డుపై పెట్రోల్ తాగిన దంపతులు..

తెలంగాణను దోచుకుంటున్నారు

సీఎం రేవంత్ రెడ్డి తన బాషను మార్చుకోవాలని రాజగోపాల్ రెడ్డి(Komatiredy Rajgopal Reddy) అన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరేటప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తన కంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని, ఇది పార్టీలో అనుభవజ్ఞులను నిర్లక్ష్యం చేయడమేనని విమర్శించారు. తన మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదన్నారు. తనకు మంత్రి పదవే కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవాడన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. ఇంకా మూడున్నరేళ్ళు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని,  ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దామన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి  విమర్శించారు. కాలేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన  డిమాండ్ చేశారు. 

Also Read :  UP crime : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!

ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయ్ 

మీడియాపై, సోషల్ మీడియాపై సీఎం రేవంత్ గతంలో చేసిన కామెంట్లపై రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పందించారు. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లు సీఎం రేవంత్  వ్యవహరం ఉందన్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ ఉందన్నారు  రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీకి రాని కేసీఆర్ ముందు తన ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

Also read :  Srushti Fertility Centre : సృష్టి కేసులో సంచలన విషయాలు.. ఆ గ్యాంగులతో నమ్రతకు లింకు

Also read :  PMFBY: కేవలం రూ.76 చెల్లిస్తే.. రూ.38 వేల బెనిఫిట్.. రైతులకు మోదీ సర్కార్ బంపరాఫర్!

Advertisment
తాజా కథనాలు