PMFBY: కేవలం రూ.76 చెల్లిస్తే.. రూ.38 వేల బెనిఫిట్.. రైతులకు మోదీ సర్కార్ బంపరాఫర్!

రైతులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రూ.76 ప్రీమియం చెల్లిస్తే సుమారు రూ.38,000 వరకు బీమా కవరేజ్ అందిస్తుంది. వర్షాలు, వరదలు, తుఫానులు, కరువు, తెగుళ్లు వంటి విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే ఇది వర్తిస్తుంది.

New Update
Pradhan Mantri Fasal Bima Yojana

Pradhan Mantri Fasal Bima Yojana

రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు, ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం‘‘ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’’ (PMFBY) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా తక్కువ ప్రీమియంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం వాటిల్లినప్పుడు, చీడపీడలతో పంటకు నష్టం వాటిల్లినపుడు రైతులు ఆర్థికంగా నష్టపోకుండా రక్షణ కల్పిస్తుంది. ఇలా రైతులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా బీమా వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇదే విషయాన్ని తాజాగా వ్యవసాయ శాఖ అమలాపురం డివిజన్‌ సహాయ సంచాలకుడు కెనడీ, మండల వ్యవసాయాధికారి కె.ప్రవీణ్‌ వెల్లడించారు. అందువల్ల రైతులు ఆగస్టు 15 వరకు తమ వరి పంటలకు బీమా ప్రీమియం చెల్లించవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు.  

Pradhan Mantri Fasal Bima Yojana

రైతులు పంటలకు అయ్యే ఖర్చులో చాలా తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. దీనివల్ల రైతులకు ఆర్థిక భారం తగ్గుతుంది.

ఇందులో భాగంగానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పథకం కింద కేవలం రూ.76 ప్రీమియం చెల్లిస్తే రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో వరి వంటి పంటలకు ఇది వర్తిస్తుంది. ఖరీఫ్ వరి పంటకు PMFBY పథకం కింద కేవలం రూ.76 ప్రీమియం చెల్లిస్తే.. రైతులకు సుమారు రూ.38,000 వరకు బీమా కవరేజ్ లభిస్తుంది.

అంతేకాకుండా అకాల వర్షాలు, వరదలు, తుఫానులు, కరువు, తెగుళ్లు వంటి సహజ విపత్తుల వల్ల పంట నష్టం జరిగినా కూడా ఈ బీమా వర్తిస్తుంది.

పంట కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టడానికి ఉంచిన సమయంలో (14 రోజుల వరకు) అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు కారణంగా ఏదైనా నష్టం జరిగినా ఈ బీమా వర్తిస్తుంది.

ప్రకృతి వైపరీత్యాలైన.. కరువు, వడగండ్లు, అకాల వర్షాలు, భూకంపాలు, వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు, తెగుళ్ల వల్ల పంటలకు నష్టం వాటిల్లినా కూడా ఈ పథకం ద్వారా బీమా వర్తిస్తుంది. 

ఈ పథకంలో భాగంగా పంట నష్టం జరిగిన 48 గంటల్లోగా (రెండు రోజుల్లోగా) సంబంధిత బ్యాంక్‌కు, వ్యవసాయ అధికారులకు లేదా బీమా కంపెనీకి సమాచారం అందించాలి. 

అనంతరం నష్టాన్ని నిర్ధారించిన తర్వాత అంచనా వేసి బీమా మొత్తం రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతుంది. 

బ్యాంకుల నుంచి ముందుగా రుణాలు తీసుకున్న రైతులకు ఆయా బ్యాంక్‌లే ప్రీమియం చెల్లించి బీమాను ఇస్తాయి. 

అదే సమయంలో రుణాలు పొందని రైతులు సమీపంలోని పోస్టాఫీసు, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా ప్రీమియం చెల్లించి వారి నుంచి రసీదు తీసుకోవచ్చు. 

ఈ పథకం ద్వారా రైతులు తక్కువ ప్రీమియం చెల్లించి, తమ పంటలకు పూర్తి రక్షణ పొందవచ్చు. ఇది రైతుల ఆదాయాన్ని స్థిరీకరించడానికి, వ్యవసాయాన్ని కొనసాగించడానికి ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.

Advertisment
తాజా కథనాలు