Wines close: తెలంగాణలో వైన్ షాపులు, బార్లు బంద్!
తెలంగాణలో మరో 48 గంటలపాటు వైన్స్, బార్లు మూతపడనున్నాయి. మే 27న వరంగల్, నల్లగొండ, ఖమ్మంలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. దీంతో మే 25-27 సాయంత్రం 4 వరకూ క్లోజ్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో మరో 48 గంటలపాటు వైన్స్, బార్లు మూతపడనున్నాయి. మే 27న వరంగల్, నల్లగొండ, ఖమ్మంలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. దీంతో మే 25-27 సాయంత్రం 4 వరకూ క్లోజ్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
భద్రాచలంలో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొణిజర్ల మండలం సిద్ధిక్నగర్కు చెందిన పగిడిపల్లి కారుణ్య (17) అనే విద్యార్థిని కాలేజీ భవనం పై నుంచి కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ చదువుతున్న పగిడిపల్లి కారుణ్య (18) అనే విద్యార్థినికి చెవి, ముక్కులో నుంచి రక్తస్రావం జరగగా.. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ ఆగంతకుడు హాస్టల్లో చొరబడ్డాడని విద్యార్థినులు చెబుతున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు. కేటీఆర్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
TG: రాష్ట్రంలో సన్నవడ్ల సాగు పెంచేందుకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ధాన్యం సేకరణలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెయ్యి రెట్లు నయం అని అన్నారు. గతేడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాంబాయిగూడెంలో ఆడుకునేందుకు చిన్నారి కల్నిష కారు ఎక్కింది. అయితే, కారులో ఊపిరి ఆడకపోవడంతో చిన్నారి మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి, కీన్స్ టెక్నాలజీ గుజరాత్ కు వెళ్లిపోయిందన్నారు. వరంగల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం గోపాలపేట లో కొద్ది రోజుల క్రితం జరిగిన హత్యోదంతం కేసును తల్లాడ పోలీసులు ఛేధించారు. కన్నతల్లితో పాటు ఇద్దరు కూతుళ్లను గొంతు నులిమి చంపిన నిందితుడు పిట్టల వెంకటేశ్వర్లు సహా అతడి రెండో భార్య త్రివేణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
TG: మార్పు కావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారని అన్నారు మంత్రి పొంగులేటి. ఇళ్లులేని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు.