Accident: ట్రాక్టర్ ను ఈడ్చుకెళ్లిన లారీ.. ఇద్దరు మృతి..!
ఖమ్మం- అశ్వారావుపేట జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారావారిగూడెం సర్కిల్ వద్ద కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.