Telangana: రేపటి నుంచే రైతు భరోసా అమలుకు శ్రీకారం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ విధివిధానాలు ఖరారు చేయనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించనుంది. By Manogna alamuru 09 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rythu Bharosa Scheme: రైతు భరోసా పథకం విధివిధానాలు రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. దీనిలో ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి (Bhatti Vikramarka) ఉండగా.మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు కమిటీ మెంబర్లుగా ఉన్నారు. వీరందరూ కలిసి రైతు భరోసా పథకం విదివిధినాలను రూపొందించనున్నారు. ఈ కమిటీ ఈనెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వరుసగా పర్యటించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకం అమలుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు వినాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. పాత పది జిల్లాల్లో వర్క్ షాప్ ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను సమగ్ర నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసి తదనంతరం రైతు భరోసా పథకం అమలుచేయనున్నారు. Also Read: Telangana: జర్నలిస్టులకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం-పొన్నం ప్రభాకర్ #rythu-bandhu #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి