Telangana : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కలిశారు. రెండు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారులు, జలవనరుల మీద చర్చించారు. భద్రాచలం ఐదు గ్రామాల విలీనం ఆవశ్యకతను మంత్రి తుమ్మల.. చంద్రబాబుకు వివరించారు. By Manogna alamuru 08 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Tummala Met AP CM : పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) కు అక్కడ నుంచి పులిచింతల నాగార్జున సాగర్ కు గోదావరి జలాలు తరలింపు భవిష్యత్ లో కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) కు వివరించారు తెలంగాణ (Telangana) మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు (Thummala Nageshwara Rao). పట్టిసీమ టూ పులిచింతల లింక్ తో శ్రీశైలం నీళ్ళు రాయలసీమ సాగు నీటి కష్టాలు తీరుతాయని చెప్పారు. దీనివలన తెలంగాణకు కూడా మేలు జరుగుతుందన్నారు. అలాగే సత్తుపల్లి టూ కోవూరు రైల్వే లైన్, పెనుబల్లి టూ కొండపల్లి రైల్వే లైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరమని తుమ్మల సూచించారు. ఇక తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ రైల్వే లైన్ తో బొగ్గు రవాణా పుణ్య క్షేత్రాలు సందర్శించే భక్తులకు ప్రయోజనకరమని, కొత్తగూడెం టూ పెనుబల్లి రైల్వే లైన్ పూర్తయింది. ఏపిలో రైల్వే పై దృష్టి పెట్టాలని తుమ్మల సూచించనట్లు తెలిపారు. Also Read:PM Modi: ఈరోజు నుంచి ప్రధాని మోదీ మాస్కో పర్యటన #prakasam-barrage #thummala-nageshwara-rao #ap-cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి