Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి తుమ్మల
TG: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ప్రాజెక్టు గండి కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శిస్తారు. బాధిత రైతాంగానికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించనున్నారు.