ఖమ్మం: తగ్గిన వరద.. ఆ రూట్లో రాకపోకలకు పోలీసుల అనుమతి
ఖమ్మం జిల్లాలో తీగల బంజారా వాగు వరద ఉధృతి తగ్గింది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు రహదారి పై ట్రాఫిక్ ను అనుమతిస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఖమ్మం జిల్లాలో తీగల బంజారా వాగు వరద ఉధృతి తగ్గింది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు రహదారి పై ట్రాఫిక్ ను అనుమతిస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
TG: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క. వరద బాధితులను కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే నిధులు విడుదల చేస్తామన్నారు.
TG: ఖమ్మం జిల్లాలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా మున్నేరు వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
తెలంగాణలో ఇంకా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి మున్నేరు వాగులో చేరుతోంది. దీంతో ఇది పొంగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ స్పీకర్ భట్టి కూడా ఖమ్మానికి బయలుదేరారు.
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రమణ అనే కానిస్టేబుల్ భద్రాచలం బిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోను రమణ విడుదల చేశాడు. ఆరోగ్య సమస్యల వల్లే తాను చనిపోతున్నట్లు ఆ వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం అతని మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు మరో పది రోజుల్లో విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాగే మరో 6 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం రేవంత్ పిలుపుతో తన నెల జీతం రూ.1.90 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు అందిస్తున్నట్లు మల్లు రవి వెల్లడించారు.
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు, పోలీస్ బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కరకగూడెం మండలం అడవుల్లో పోలీసులపై బాంబులతో దాడికి దిగారు మావోయిస్టులు. ఈ తూటాల మోతలతో భయం గుప్పెట్లో ఆయా జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలు ఉన్నారు.
వరదల కారణంగా నష్టపోయిన బాధితులందరినీ ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితుల గుర్తింపునకు అధికారులు వెంటనే సర్వే ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.