Constable Suicide: బిడ్జిపై నుంచి దూకి కానిస్టేబుల్‌ ఆత్మహత్య

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రమణ అనే కానిస్టేబుల్ భద్రాచలం బిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోను రమణ విడుదల చేశాడు. ఆరోగ్య సమస్యల వల్లే తాను చనిపోతున్నట్లు ఆ వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం అతని మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

New Update
Constable Suicide: బిడ్జిపై నుంచి దూకి కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Constable Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం బిడ్జిపై నుంచి దూకి కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన కానిస్టేబుల్‌ రమణారెడ్డిగా గుర్తించారు. కానిస్టేబుల్ రమణ రెడ్డిది పాల్వంచ. 2000 బ్యాచ్ కు చెందిన రమణారెడ్డి..ప్రస్తుతం కొత్తగూడెం క్లూస్ టీమ్ లో పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్‌ రమణారెడ్డి మృతదేహం కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు రమణ. యాక్సిడెంట్‌ తో ఆరోగ్యం దెబ్బతిందని...పూర్తిగా సహకరించడం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇంకేమైనా కారణాల వల్ల రమణ సూసైడ్ చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు