Peddapalli: రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. గుండు గీసి, మీసాలు తొలగించి
రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో జూనియర్ మెడికో విద్యార్థులపై పలువురు సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. గుండుచేసి మీసాలు తొలగించగా భయంతో జూనియర్లు కాలేజీ వదిలి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.