/rtv/media/media_files/2025/09/06/khairatabad-ganesh-immersion-2025-09-04-12-53-06-2025-09-06-06-15-46.webp)
Khairatabad Ganesh Shobhayatra
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ట్యాంక్ బండ్ అంతా గణపతులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్రజలు అందరూ ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర, నిమజ్జనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న వినాయకుని శోభాయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. అయితే ఈ ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఫుల్ డిటైల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Ganesh Chaturthi 2023: పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా.. చూస్తే వావ్ అనాల్సిందే..
శోభాయాత్ర వివరాలు
ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. శోభాయాత్ర మొదలు పెట్టే ముందు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ యాత్ర దాదాపుగా 2.5 కిలోమీటర్ల దూరం వరకు సాగుతుంది. ఖైరతాబాద్ నుంచి మొదలై, సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్‌టీఆర్ మార్గ్ మీదుగా హుస్సేన్ సాగర్ చేరుకుంటుంది. దారంతా కూడా భక్తులు డోలు తాషా బృందాలతో, సాంస్కృతిక ప్రదర్శనలతో గణపతి బప్పా మోరియా అనే నినాదాలతో వినాయకుడిని పంపిస్తారు. అయితే శోభాయాత్ర తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరకు మధ్యాహ్నం 12 గంటలకు చేరనున్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత ఎన్‌టీఆర్ మార్గం ద్వారా హుస్సేన్ సాగర్ దగ్గర క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం జరుగుతుంది. ఈ భారీ విగ్రహాన్ని ఎత్తడానికి బహుబలి క్రేన్ వాడతారు. అయితే అధికారుల అంచనా ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గణేశ్ నిమజ్జనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ. ఆనంద్ ఆధ్వర్యంలో 30,000 మంది పోలీసులను నియమించారు. ఖైరతాబాద్, బాలాపూర్ వంటి ప్రధాన యాత్రలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భద్రత కోసం 56 సీసీటీవీ కెమెరాలు, 160 యాక్షన్ టీమ్స్, 13 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 6 గంటల ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్‌టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌లో వాహనాలను నిషేధించారు. లిబర్టీ, పంజాగుట్ట, రాణిగంజ్, ట్యాంక్ బండ్ వంటి ముఖ్యమైన కూడళ్ళను రద్దీ కారణంగా నివారించాలని పోలీసులు ప్రజలను కోరారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ప్రజలు మెట్రో, ఆర్టీసీ బస్సుల వంటి ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే 9010203626 అనే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయవచ్చు.
ఇది కూడా చూడండి: Vinayaka Chavithi 2025: వ్యాపారులకు పండగే.. వినాయక చవితికి రూ.28 వేల కోట్ల వ్యాపారం