/rtv/media/media_files/2025/09/17/key-update-on-arogyasri-services-in-telangana-2025-09-17-21-24-02.jpg)
Key Update on Arogyasri Services in telangana
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగతున్నాయని అధికారులు వెల్లడించారు. 87 శాతం ఆస్పత్రుల్లోని పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కేవలం 13 శాతం ఆస్పత్లుల్లోనే సేవలు ఆగినట్లు పేర్కొన్నారు. వైద్య సేవలను కొనసాగించాలంటూ ఆరోగ్య శ్రీ CEO ఉదయ్ కుమార్ ఆస్పత్రులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య శ్రీ కింద గత రెండు వారాలుగా సగటున ఒక్క రోజుకు 844 సర్జరీలు నమోదయ్యాయి. బుధవారం 799 సర్జరీలు జరిగినట్లు పేర్కొన్నారు.
Also Read: ఏడీఈ అంబేడ్కర్‌కు మరో షాక్.. స్నేహితుడి ఇంట్లో అక్రమాస్తులు గుర్తించిన ACB
ఇదిలాఉండగా సెప్టెంబర్ 16న అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతున్నాయాని ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.1400 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) తెలిపింది. అందుకే ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అయితే ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగతున్నాయని తాజాగా అధికారులు వెల్లడించారు.
Also read: రూ.3 కోట్లకు గ్రూప్ - 1 ఉద్యోగాలు అమ్మారు.. కేటీఆర్ సంచలన కామెంట్స్