Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు లో కీలక పరిణామం..హైకోర్టులో కేసీఆర్‌, హరీష్‌రావు పిటిషన్‌

భూపాలపల్లిలో హత్యకు గురైన రాజలింగమూర్తి కాళేశ్వరంపై వేసిన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ హైకోర్టులో కేసీఆర్‌, హరీష్‌రావు పిటిషన్‌ వేశారు.

New Update
Kaleshwaram project

Kaleshwaram project Photograph: (Kaleshwaram project )

Kaleshwaram Project : భూపాలపల్లిలో హత్యకు గురయిన రాజలింగమూర్తి కాళేశ్వరంపై హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవనీతి జరిగిదంటూ దాఖలైన పిటిషన్‌పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ హైకోర్టులో కేసీఆర్‌, హరీష్‌రావు పిటిషన్‌ వేశారు.

Also Read :  మిడిల్ క్లాస్ వారికి చీప్ అండ్ బెస్ట్ స్కూటర్ అంటే ఇదే భయ్యా!
 
  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ నమోదైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి కోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌ను కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో సవాల్ చేశారు. 

Also Read :  నిర్బంధించి పంపేస్తారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య!
 
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి భూపాలపల్లి కోర్టులో  ప్రైవేటు పిటిషన్‌ వేశారు. ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నాటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిలతో పాటు మరికొంతమందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశాడు. దీంతో జిల్లా కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.  వ్యక్తిగతంగా విచారణకు రావాల్సిందిగా భూపాలపల్లి కోర్టు జూలై 10, 2024న నోటీసులు ఇచ్చింది.  

Also Read :  Heart Stroke: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృ‌తి

 కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కేసీఆర్ తరుపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఇదే సందర్భంలో ఫిర్యాదుదారుడు రాజలింగమూర్తి చనిపోయాడు కాబట్టి కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎత్తివేయాలని న్యాయవాది కోరారు.దీంతో  ఫిర్యాదుదారుడు హత్యకు గురైనట్లు మీడియాలో చూశామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారుడు చనిపోయిన తరువాత కేసు విచారణ అర్హత ఉండదు కదా అని న్యాయస్థానం బదులిచ్చింది. అయితే ఫిర్యాదుదారుడు చనిపోయినంత మాత్రాన కేసును మూసేయ్యాలని లేదని ఆధారాను బట్టి కేసును కొనసాగించవచ్చని పీపీ వాదనలు వినిపించారు. ఈ విషయంలో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయని తెలిపారు. దానికి సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచడానికి సమయం కావాలని అడిగాడు.దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.  

Also Read: Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు