TG EAPCET: ఎంసెట్, పీజీఈసెట్ ఇక ఈజీ.. క్షణాల్లో మార్కులు.. సర్కార్ తెచ్చిన సంచలన మార్పులివే!

ఎప్‌సెట్, పీజీఈసెట్‌ పరీక్షలు రాశాక వీటి ఫలితాల కోసం విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఈ ఏడాది నుంచి వీటి పరీక్షా విధానాల్లో కీలక మార్పులు తీసుకురానున్నాయి.

New Update
Telangana State Council of Higher Education

Telangana State Council of Higher Education

ఎప్‌సెట్, పీజీఈసెట్‌ పరీక్షలు రాశాక వీటి ఫలితాల కోసం విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఈ ఏడాది నుంచి వీటి పరీక్షా విధానాల్లో కీలక మార్పులు తీసుకురానున్నాయి. విద్యార్థులు పరీక్ష పూర్తయిన వెంటనే ఎన్ని మార్కులు వచ్చాయే చూసుకోవచ్చు. ఎంత ర్యాంకు వస్తోందో ఓ అంచనాకు రావొచ్చు. శుక్రవారం JNTUHలో జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్‌) కమిటీ మీటింగ్‌లో దీనిపై అధికారులు చర్చించారు. వివిధ వినూత్న సంస్కరణలను అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు. 

కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌ (CBT) అయిన ఆన్‌లైన్‌ పరీక్ష ముగిసిన తర్వాత వెంటనే ఆటోమేటిక్‌గా కంప్యూటర్‌ ఆగిపోతుంది. స్క్రీన్‌పై క్వశ్చన్‌ పేపర్‌ కనిపించదు. సబ్జెక్టుల పరంగా చూస్తే ఎన్ని ప్రశ్నలకు సరైన ఆన్సర్లు గుర్తించారు ? ప్రాథమిక 'కీ' ఆధారంగా ఎన్ని మార్కులు వచ్చాయో స్క్రీన్‌పైనే కనిపిస్తాయి. తుది ర్యాంకు మాత్రం చివరి కీ తర్వాతే తెలుస్తుంది. పలు విడుతలుగా ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయి కాబట్టి నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేసి ర్యాంకు వివరాలు విడుదల చేస్తారు. 

Also Read: బడ్జెట్ ప్రసంగాల్లో రికార్డులివే.. చరిత్రలో ఎప్పటికీ నిర్మలమ్మ, మన్మోహన్ సింగ్‌ పేర్లు

ఇతర కీలక నిర్ణయాలు 

ఎప్‌సెట్‌, పీజీఈసెట్‌కు ఇప్పటివరకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారానే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండేది. కానీ ఈసారి మాత్రం స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కూడా అప్లై చేసుకునే విధానాన్ని తీసుకురానున్నారు. దీనికోసం మొబైల్ ఫ్రెండ్లీ యాప్‌లు రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు చూసకుంటే గత ఏడాది ఫలితాల ఆధారంగా ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంకు వస్తుందే అనే విషయం తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఈసారి మాత్రం విద్యార్థులు తమకు ఎన్ని మార్కులకు ఎంత ర్యాంకు వస్తుందో వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

గతంలో రూ.10 వేల లేట్‌ ఫీజుతో పరీక్షకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉండేది. కొన్నేళ్ల క్రితమే దీన్ని తొలగించారు. అయితే ఈసారి దీన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురానున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే రెండ్రోజుల ముందు వరకు కూడా రూ.10 వేల ఫైన్‌తో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు తీసుకురానున్నారు. అయితే రూ. 2500 నుంచి రూ.10 వేల ఆలస్య రుసుంతో అప్లై చేసుకునే వాళ్లు హైదరాబాద్‌లోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 

Also Read: బడ్జెట్ తయారీ ముందు అల్వా వేడుక.. అసలు కారణం ఇదే!

Advertisment
తాజా కథనాలు