SLBCలో రెస్క్యూ 5G లేక అడ్డంకి.. | SLBC Tunnel Latest Update | Tunnel Rescue Operation | RTV
ఎస్ఎల్బీసీ సొరంగంలో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో నుంచి మృతదేహాల వెలకితీత కోసం రోబోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూకి మరింత సమయం పట్టేలా ఉంది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను కేరళ నుంచి తెప్పించిన జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి కనిపించింది.
శ్రీశైలం టన్నెల్ ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తోన్న అందులో చిక్కుకున్న వారి జాడ ఇంతవరకు తెలియరాలేదు. ఆ 8 మంది జాడకోసం 11 రెస్క్యూ బృందాలు, సుమారు 600 మందికిపైగా సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఆఫరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఫురోగతి లేదు.