Phone Tapping Case : సిట్ నోటీసులపై KCR బిగ్‌ట్విస్ట్‌.. జూబ్లీహిల్స్‌ ఏసీపీకి సంచలన లేఖ

గత కొంతకాలంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిగ్‌ట్విస్ట్‌ ఇచ్చారు. విచారణకు సహకరిస్తానని అంటూనే అధికారుల తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్‌ ఏసీపీకి 6 పేజీల లేఖను రాశారు.

New Update
KCR

KCR

Phone Tapping Case: గత కొంతకాలంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిగ్‌ట్విస్ట్‌ ఇచ్చారు. విచారణకు సహకరిస్తానని అంటూనే అధికారుల తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్‌ ఏసీపీకి 6 పేజీల లేఖను రాశారు. క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి కేసీఆర్‌ తన వివరణ ఇచ్చారు. నంది నగర్ నివాసం గోడపై నోటీసు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారించాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని కేసీఆర్ వెల్లడించారు.మాకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదు. నాకు ఇచ్చిన నోటీసు అక్రమం. నోటీసు ద్వారా నా గౌరవానికి భంగం కలిగించారు. ఇంటి గోడలకు నోటీసులు అంటించడం ఏంటి. ఇది సరైన పద్దతి కాదు. చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నా విచారణకు సహకరిస్తా. రేపు నందినగర్‌ నివాసంలో విచారణకు హాజరవుతా అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read: రేపే బడ్జెట్.. గ్యాస్, సిగరేట్స్ నుంచి ఫాస్టాగ్ వరకు.. రేపటి నుంచి ఈ ధరల్లో మార్పు?

ఇకనుంచి వచ్చే నోటీసులన్నీ ఎర్రవల్లికే రావాలి

‘నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని కేసీఆర్‌ ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లోని చిరునామాకు, సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదు. ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతోందన్నారు. ఈ సందర్భంగా సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసు తీర్పును కేసీఆర్‌ ఉటంకించారు. హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని విమర్శించారు. పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు. బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తా. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధం. నంది నగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కానీ నేను ఆపని చేయడం లేదు. భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచన చేస్తున్నాను. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులోని 'వీడీ మూర్తి' కేసు తీర్పును లేఖలో కేసీఆర్‌ ప్రస్తావించారు. పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’ అని లేఖలో కేసీఆర్ ఆవేదన చెందారు.  

Advertisment
తాజా కథనాలు