KCR: ఎట్టకేలకు కేసీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ వెలువడింది. కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని రూపొందించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) ఈ రోజు విడుదలైంది. ఆ సినిమాలో గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ రోల్ లో నటించినట్లు రాకేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశాడు.
పార్టీలకు అతీతంగా చేసిన సినిమా..
ఈ మేరకు సినిమా విడుదలను పురష్కరించుకుని మీడియాతో మాట్లాడిన ఈ సినిమా హీరో రాకింగ్ రాకేశ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ఈ సినిమాను పార్టీలకు అతీతంగా తెరకెక్కించారు దర్శకుడు ‘గరుడవేగ’ అంజి. మూవీ టైటిల్ పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించాను. ఇది వరంగల్ నేపథ్యంలో సాగే కథ. బంజారా కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు వాళ్ల ఊర్లో జరుగుతున్న ఒక దారుణాన్ని తనకు తెలిసీ తెలియని వయసులో భుజాన వేసుకుని.. దాన్ని పరిష్కరించేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. మరి ఈ ప్రయాణంలో ఇక్కడ తనకెదురైన సవాళ్లేంటి? ఇక్కడ తనేం సంపాదించాడు? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తరుణంలో తనని ఎవరు కలిశారు? ఆఖరికి తన ఊరి సమస్యను పరిష్కరించి ఎలా హీరో అయ్యాడన్నది చిత్ర ప్రధాన కథాంశం. దీన్ని అందరూ ‘బలగం’తో పోలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ సినిమాకు దానికీ ఎలాంటి పోలిక లేదు’ అని చెప్పాడు.
ఇది కూడా చదవండి: పీఏసీ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. వైసీపీ సంచలన నిర్ణయం!
ఇక ఈ మూవీలో తాను కేసీఆర్ అభిమానిగా హీరో కేశవ చంద్ర రమావత్ పాత్రలో కనిపిస్తానని చెప్పాడు. అందుకే ఆ పాత్ర పేరుకు తగ్గట్లుగా ఈ చిత్రానికి షార్ట్‌కట్‌లో ‘కేసీఆర్’ పేరు పెట్టామని, ఇందులో కేసీఆర్ కూడా నటించినట్లు చెప్పాడు రాకేశ్. కేసీఆర్ కు తెలియకుండా ఆయనను పెట్టి ఈ సినిమా తీశామని, ఇదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. తన ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరాడు.
ఇది కూడా చదవండి: TG: జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు!