పీఏసీ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. వైసీపీ సంచలన నిర్ణయం! పీఏసీ ఛైర్మన్ ఎన్నికకు ఏపీ అసెంబ్లీలో ఓటింగ్ కొనసాగుతోంది. సంఖ్యాబలం లేకపోవడంతో ఓటింగ్‌ను వైసీపీ బాయ్‌కాట్ చేస్తోంది. పీఎసీ సభ్యత్వాలకు 9 మంది సభ్యులు నామినేషన్ వేశారు. టీడీపీ తరఫున ఏడుగురు సభ్యులు నామినేషన్ వేయగా.. జనసేన తరఫున పులవర్తి రామాంజనేయులు నామినేషన్ వేశారు. By Nikhil 22 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి పీఏసీ ఛైర్మన్ ఎన్నికకు ఏపీ అసెంబ్లీలో ఓటింగ్ కొనసాగుతోంది. సంఖ్యాబలం లేకపోవడంతో ఓటింగ్‌ను వైసీపీ బాయ్‌కాట్ చేస్తోంది. పీఎసీ సభ్యత్వాలకు 9 మంది సభ్యులు నామినేషన్ వేశారు. టీడీపీ తరఫున ఏడుగురు సభ్యులు నామినేషన్ వేయగా.. జనసేన తరఫున పులవర్తి రామాంజనేయులు నామినేషన్ వేశారు. బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. పీఏసీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఎన్నికయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. పులవర్తి రామాంజనేయులు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 18 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. అయితే.. వైసీపీకి కేవలం 11 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అయితే.. కేవలం 9 మంది సభ్యులు మాత్రమే బరిలో ఉంటే పీఏసీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉండేది. కానీ.. మొత్తం పది మంది నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే.. పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఈ సారి తూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి తూట్లు పొడుస్తుందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి