కవిత సంచలన వ్యాఖ్యలు.. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావే అసలు దొంగ

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సీబీఐ ఎక్వైరీ వేయడంపై కవిత స్పందించారు. హరీశ్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు, హరీశ్ రావుపై కీలక ఆరోపణలు చేశారు ఆమె. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని కవిత అన్నారు.

New Update
harish rao

Harish rao

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సీబీఐ ఎక్వైరీ వేయడంపై BRS MLC కవిత స్పందించారు. ఈ సందర్భంగాా హరీశ్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయన్ని ఇరిగేషన్ మినిస్టర్‌గా తొలగించారని కవిత అన్నారు. హరీశ్ రావు, సంతోష్‌ రావుల వల్లనే కేసీఆర్‌పై అవినీతి మరకలు పడుతున్నాయని కవిత మీడియా ముందు అన్నారు. ఆ అవినీతి అనకొండల మీద ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్న వారి పేర్లు మొదటి సారిగా బయటపడుతున్నా అని పేర్కొన్నారు. BRS ముఖ్యనేతలు, హరీశ్ రావుపై కీలక ఆరోపణలు చేశారు ఆమె. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని కవిత అన్నారు. హరీశ్ రావు, సంతోష్ రావుల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది. వరదలు వస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.   బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆరు నెలల ముందు యూరియా కోసం కేసీఆర్ మమ్మల్ని అలెర్ట్ చేసేవారని కవిత గుర్తు చేశారు. కాళేశ్వరం లాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న పార్ట్ అని ఆమె అన్నారు. కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడం కోసం ఆరు, ఏడు నెలలు రీసెర్చ్ చేశారు. కేసీఆర్‌కు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఉండదు.  కానీ మా నాన్నపై ఆబండాలు వేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ళు ప్రజలు గుర్తు ఉంచుకుంటున్నారు. నాపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తా అని ఆమె వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పి.సి.ఘోష్  కమిషన్ పేరుతో టైం పాస్ చేస్తోంది.రేవంత్ రెడ్డికి కేసీఆర్ పెరు చెప్పకపోతే పేపర్‌లో ఫోటో రాదు. సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగినముత్యంలా బయటకు వస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు