తెలంగాణకు పసుపు హెచ్చరిక.. రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు వాతావరణం
తెలంగాణలో వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
క్రిస్మస్ సెలవుల కోసం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలుడ్ని గుండెపోటు చంపేసింది. రాజన్న సిరిసిల్ల గ్రామానికి చెందిన సుశాంత్ (13) సోమవారం ఉదయం ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో ఒక వర్గం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్లో 9, కరీంనగర్లో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఐసోలేషన్లో 55మంది ఉన్నారని, అయితే కొత్త వేరియంట్ జేఎన్ 1 సోకిన కేసులు రాష్ట్రంలో ఇంకా నమోదు కాలేదని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ నెల 27న జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో 39,748 కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు 700మంది సిబ్బందిని కేటాయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్ ప్రకటించడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ స్వాగతించారు. అయితే తెల్ల రేషన్ కార్డే అర్హతగా పేర్కొనడంపై సందేహం వ్యక్తం చేశారు. ముందు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
82960 09383, 88670 24793 ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి.. ఇల్లు కడుతుండగా బంగారం దొరికిందని, సగం రేటుకే దాన్ని ఇచ్చేస్తున్నామని జనాలకు ఫోన్ చేసి వల వేస్తోంది ఓ బెంగళూరు గ్యాంగ్. జనాన్ని నమ్మించేందుకు కొన్ని ఫొటోలను వాట్సాప్లో కూడా పంపిస్తోంది. నమ్మితే ఇక అంతే సంగతులు..
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బాల్క సుమన్, గువ్వల బాలరాజు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రెడ్యానాయక్ తదితరులను బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నుర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.