Ponnam: 'రాముడి అక్షింతలతో రాజకీయం'..బండి సంజయ్ పై మంత్రి పొన్నం గరం తాను హిందూ వ్యతిరేకి అంటూ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాముడి అక్షింతలతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. కరీంనగర్ కు ఎంపీ గా ఉన్న బండి సంజయ్ ఈ ఐదేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 17 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Minister Ponnam Prabhakar: బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై (Bandi Sanjay) మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాముడి (Ayodhya Ram Mandhir) అక్షింతలతో బీజేపీ (BJP) రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కరీంనగర్ కు ఎంపీ గా ఉన్న బండి సంజయ్ ఈ ఐదేళ్లలో ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తాను హిందూ వ్యతిరేకి అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ALSO READ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎన్నికల కొసమే.. నలుగురు శంకరాచార్య పీఠాధిపతులు రామాలయం ప్రారంభోత్సవం పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది నిజం కాదా...? అని బండి సంజయ్ ను ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయ నిర్మాణం పూర్తికాకముందే మహాసంప్రోక్షణ జరుగుతోందని, అది హిందూ ఆచారాలను పాటించడం లేదని వారి ఆందోళన చేసిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. అయోధ్యలో రాముడి దేవాలయం పూర్తి కాకముందే బీజేపీ అధిష్టానం, నరేంద్ర మోడీ (Narendra Modi) గారు ప్రారంభిస్తున్నారు , ఇది దేనికి సంకేతం ఎన్నికల కొసమే కదా ఇది..? అని అన్నారు. ఏమి చేశారో చెప్పండి.. కరీంనగర్ నుంచి ఎంపీగా (Karimnagar MP) ప్రజలు గెలిపిస్తే.. ఎంపీ అయిన ఈ 5 ఏళ్లలో కరీంనగర్ కి నువ్వు ఎం చేశావు బండి సంజయ్ కుమార్? అని ప్రశ్నించారు పొన్నం (Ponnam Prabhakar). 'నన్ను హిందుల వ్యతిరేకి అంటున్నవు నేను ఎంటో నా భక్తి ఎంటో హిందువుల పట్ల ప్రజల పట్ల నా శ్రద్ధ ఎంటో కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు అడిగిన తెలుస్తుంది!, మత పరమైన రాజకీయాల గురించి నువ్వు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు, బండి సంజయ్ కుమార్ నీకు రాముడి పై అంత భక్తి ఉంటే ఈ 5 ఏళ్ళలో మన తెలంగాణ లో ఉన్న భద్రాద్రి రాముడి దేవాలయం అభివృధి కోసం నువ్వు , మీ బీజేపీ చేసింది ఏమిట?' అంటూ ధ్వజమెత్తారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే వేములవాడ రాజన్న కి దేవాలయం అభివృధి కి నిధులు ఎందుకు తీసుకరాలేదు? అని బండి సంజయ్ ను మంత్రి పొన్నం నిలదీశారు. కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం అభివృధి కోసం చేసిన పోరాటం ఏమిటి ?, ధర్మపురి లక్ష్మనరసింహ స్వామి వారి దేవస్థానం, కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం, వరంగల్ భద్రకాళి దేవాలయం, బాసర సరస్వతీ దేవి దేవాలయం.. ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో దేవాలయాలు తెలంగాణ లో అభివృద్ధికి నోచుకోక మిగిలిపోయాయి వీటి కోసం నీ పోరాటం ఎక్కడ కనీసం ఏరోజు అయిన వాటి పరిష్కారం కోసం మాట్లాడిన పాపాన పోలేదు అంటూ ఫైర్ అయ్యారు. 5 ఏళ్ళలో నువ్వు చేసిన అభివృధి ఎక్కడ అంటే రాముడి ఫోటోలు పెట్టీ రాముడిని మార్కెటింగ్ చేస్తూ మళ్ళీ ఎన్నికలో గెలుపు కోసం ఆరాట పడుతున్నావు , ఇంకా నీ ఆటలు సాగవు, భార్య పుస్తెలతాడు అమ్ముకున్న అని ఎన్నికలో గెలిచి అభివృధి బాటలు వెయ్యాల్సింది పోయి అమాయక కరీంనగర్ జనం కి మత పరమైన ఘర్షణలు పరిచయం చేసిన నీకు తగిన బుద్ధి చెప్తారు కరీంనగర్ ప్రజానికం అంటూ బండి సంజయ్ ను హెచ్చరించారు. అక్షింతలు కాదు రేషన్ బియ్యం.. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో ఎవరో మీడియా మిత్రుడు అవి అయోధ్య రామయ్య అక్షింతలు కాదు రేషన్ బియ్యం అన్నారు, కానీ ఇపుడు అంటున అవి రేషన్ బియ్యం కాదు అని నిరూపించు పేదలు తినే రేషన్ బియాన్ని రాముడి అక్షింతలతో కూడా రాజకీయం చేస్తుంది మీ పార్టీ కాదా..? అని బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు. కేవలం బీజేపీ వలతో ఎందుకు ఆ అక్షింతలు పంపిణీ చేస్తున్నారు , ఇది కదా దేవుడు పై రాజకీయం చేయడం అంటే, బండి సంజయ్ కుమార్ ? అని అన్నారు. ఇది కూడా చదవండి: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్! DO WATCH EXCLUSIVE CONTENT: #ponnam-prabhakar #minister-ponnam-prabhakar #bjp-party #congress-party #ayodhhya-ram-mandir #bandi-sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి