రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!
TG: ఎన్నికల హామీలో భాగంగా క్వింటాలు సన్న రకం ధాన్యానికి రేవంత్ సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించింది. మొత్తం 33 సన్న రకాల వరి వంగడాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను విడుదల చేసింది.
TG: ఎన్నికల హామీలో భాగంగా క్వింటాలు సన్న రకం ధాన్యానికి రేవంత్ సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించింది. మొత్తం 33 సన్న రకాల వరి వంగడాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను విడుదల చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్నారం బ్యారేజ్ వద్ద పరీక్షలు చేసిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) షాకింగ్ విషయలు బయటపెట్టింది. ఈ బ్యారేజ్ లోని 16 గేట్ల నిర్మాణంలో అసలు నాణ్యతే పాటించలేదని బయటపెట్టింది.
TG: MLC జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నానని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టాలని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ సుందరీకరణ కోసం కట్టిన గోడను బీఆర్ఎస్ నాయకులు కూల్చేశారని ఆరోపించారు.
తెలంగాణ బీజేపీకి డిసెంబర్లో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, పాయల్ శంకర్ ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. హైకమాండ్ వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పరువు నష్టం కల్గించేలా వ్యాఖ్యలు చేశారని.. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా దీనిపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
TG: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిపై వేటువేయాలని డిమాండ్ చేశారు. గత 4నెలలుగా తాను ఎన్నో అవమానాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ఓ రైతుకు తెలియకుండానే అతడి పేరుతో బ్యాంకు లోన్లు తీసుకున్నారు. ఆధార్ కార్డులో ఫోటో మార్చి, పాన్ కార్డు సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారు. ఏడు బ్యాంకుల్లో రైతు పేరుతో రూ.20 లక్షలు లోన్ తీసుకున్నారు. బాధితుడు పంట రుణం కోసం బ్యాంకుకు వెళితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.