Jubilee Hills By Elections : కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కోడలు?

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్‌ మాగంటి గోపినాథ్‌ భార్యను అభ్యర్థిగా ప్రకటించింది.

New Update
congress

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(jubilee hills by‑elections)ను రేవంత్(CM Revanth Reddy) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్‌ మాగంటి గోపినాథ్‌ భార్యను అభ్యర్థిగా ప్రకటించింది. మాగంటి సునీతతో పాటు కుటుంబ సభ్యులు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని బరిలోకి దించడంతో.. కాంగ్రెస్ కూడా అదే స్టాటజీని వర్క్‌ ఔట్‌ చేయాలని చూస్తోంది. 

మాజీమంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి ఇక్కడ కాంగ్రెస్ టికెట్‌ ఆశిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మహిళ సెంటిమెంట్‌ కూడా వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉండటంతో.. కంజర్ల విజయలక్ష్మీ పేరు తెరపైకి వచ్చింది. జలగం వెంట్రావు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ కోడలు విజయలక్ష్మీ. ఆయన 1973- 78 బీసీ, లేబర్ మినిస్టర్ గా పనిచేశారు. అంతే కాదు లక్ష్మీనారాయణ పేరుపై జూబ్లీహిల్స్ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దీంతో అక్కడి ప్రజల్లో కంజర్ల ఫ్యామిలీకి మంచి పేరుతో పాటు గుర్తింపు ఉంది. 

Also Read :  అలెర్ట్‌.. కాసేపట్లో భారీ వర్షం

సేవా కార్యక్రమాలు చేయడంలో

నిత్యం ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేయడంలో కంజర్ల ఫ్యామిలీ ముందు ఉంది. దీంతో తనకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు కంజర్ల విజయలక్ష్మీ. తనకు టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ ప్రాంతంలోని పలువురు బీఆర్ఎస్ బలమైన లీడర్లు కాంగ్రెస్‌లోకి వస్తారని, తన గెలుపుకోసం పని చేస్తారని ఆమె చెప్తున్నారు. యాదవ సామాజిక వర్గం తర్వాత జూబ్లీహిల్స్ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారితోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని..టికెట్ ఇస్తే తాను గెలుస్తానని పలువురు మంత్రులకు ఆమె చెప్పారు. దీంతో అధిష్టానం కూడా ఆమె పేరును పరిశీలిస్తోందని తెలుస్తోంది.

Also Read :  నేను చనిపోతున్నాను.. సెలవిక... తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని సంచలన లేఖ

మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ సైతం

మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ సైతం తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఈయన కొడుకు రాజ్యసభ ఎంపీగా ఉన్న నేపథ్యంలో వాళ్ల కుటుంబానికి మరోసారి అవకాశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక స్థానిక కాంగ్రెస్‌ యువనేత నవీన్‌యాదవ్‌, రహమత్‌నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి పేరిట కూడా పోస్టర్లు వెలిశాయి. మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భార్య శ్రీదేవి, మాజీ కార్పొరేటర్‌ మురళీగౌడ్‌ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మొత్తంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉపఎన్నిక అధికార కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేయడానికి ఆశావాహులు పుట్టుకొస్తున్నారు. స్థానికులకే అవకాశం కల్పిస్తామని, బయటి వారికి అవకాశం ఉండదని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టతనిచ్చారు. దీంతో స్థానిక నేతలు నవీన్‌యాదవ్‌, సీఎన్‌రెడ్డి, మురళీగౌడ్‌, కంజర్ల విజయలక్ష్మికి ఆశలు పెరిగాయి. ఎవరికి వారే టికెట్ కోసం అధిష్టానం వద్ద లాబీయింగ్ మొదలు పెట్టారు.

Advertisment
తాజా కథనాలు