/rtv/media/media_files/2025/10/22/jubilee-hills-elections-2025-10-22-20-02-37.jpg)
Betting on Jubilee Hills elections...more than Rs. 500 crores..
Jubilee Hills Bipole : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. మాగంటి గోపినాథ్ అకాల మృతితో వచ్చిన ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలో చర్చనీయంశంగా మారింది. కేవలం ఒక స్థానానికి జరుగుతున్న ఈ ఎన్నికలో గెలిచినా, ఓడినా అధికార, ప్రతిపక్ష పార్టీలకు వచ్చేది ఏమీ లేదు. కానీ, ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ రెండేండ్ల పాలనకు నిదర్శనంగా నిలవనుండటంతో ఎలాగైన గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను సొంతం చేసుకోవాలని ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక బెట్టింగ్ రాయుళ్లకు కూడా కలిచివచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ గెలుపోటములపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల స్థాయిలో ఈ బెట్టింగ్‌లు సాగుతున్నాయి. గెలుపు, ఓటములతోపాటు అభ్యర్థి సాధించే మెజార్టీపైనా, సెకండ్ ప్లేస్ పై కూడా పందెం రాయులు బెట్టింగులు కాస్తున్నారు.
Also Read: J&K: కాశ్మీర్ లో దాడులకు లష్కరే, జైషే ఉగ్రవాదులు సంయుక్తంగా ప్లాన్..
నాలుగు లక్షల మంది ఓటర్లున్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అనే విషయం నుంచి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు? ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తోంది? తదితర అంశాలపై ఈ బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఇప్పటికే సుమారుగా రూ.500కోట్ల మేర పందేలు కాసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు చేయించుకుంటోంది. విజయం తమదేనని ప్రచారం చేసుకుంటోంది. దీంతో మరో వైపు సర్వే సంస్థల పంట పండుతోంది.కాగా నాలుగు లక్షల ఓట్లు ఉన్న ఇక్కడ 2009లో 52.76% 2014లో 50.18%, 2018లో 45.59 %, 2023లో 47.49% ఓట్లు పోలయ్యాయి. అంటే మొత్తం ఓట్లలో 30 శాతం ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలిచే అవకాశం ఉంది. దీనిపై ప్రధానంగా కూకట్ పల్లి కేంద్రంగా ఈ బెట్టింగులు సాగుతున్నట్టు తెలుస్తోంది.
ఇక్కడ ముఖ్యంగా మూడు అంశాలపైనే ప్రధానంగా బెట్టింగ్ సాగుతోంది. ఒకటి గెలుపు ఓటములపైన అయితే , రెండోది విజేత పది వేల కన్నా ఎక్కువ మెజార్టీ సాధిస్తాడా..? తక్కువ మెజార్టీ సాధిస్తాడా..? అన్నదానిపై మూడోది రెండో ప్లేస్ ఎవరికి వస్తుందనే దానిపైనే బెట్టింగులు సాగుతున్నాయి. ఇప్పటికే రూ.500 కోట్లకుపైనే బెట్టింగ్ జరిగినట్టు సమాచారం ఉండగా ..ఫలితాల వెలువడే నాటికి రూ.1000 కోట్లకు చేరవచ్చని అంటున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, మణికొండతోపాటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందినవారితో పాటు, ఏపీలోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిసింది. దీనికోసం కొందరూ ప్రైవేటు ఏజెన్సీలతో సర్వేలు కూడా చేయిస్తు్న్నారు. దాని ఆధారంగా బెట్టింగ్‌లు కాయడానికి సిద్ధమవుతున్నారు.
ఇది కూడా చూడండి: Bus Accident: చేవెళ్ల ఘటన మరవకముందే తెలంగాణలో మరో ఆర్టీసీ ప్రమాదం.. డివైడర్ ఎక్కడంతో స్పాట్‌లో..!
Follow Us