/rtv/media/media_files/2025/01/06/LXJVI5nkiDWyzfUPrXaF.jpeg)
Voter List
Jubilee Hills by-election : మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 మందిగా ఎన్నికల సంఘం పేర్కొంది. సెప్టెంబరు 17 రాత్రి వరకు కొత్తగా ఓటు నమోదుకు 6,563 దరఖాస్తులు, తొలగింపు కోసం 361, సవరణ కోసం 2,298 దరఖాస్తులు వచ్చినట్లు ఈసీ తెలిపింది.
సవరించిన జాబితా ప్రకారం 2,07,367 మంది పురుషులు, 1,91,590 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. నియోజకవర్గంలో లింగ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 924 మహిళలుగా ఉన్నారని పేర్కొంది. ఓటర్లలో1891 మంది దివ్యాంగులు, 95 మంది విదేశీయులు ఉన్నారు.
సెప్టెంబరు 2న విడుదలైన ప్రాథమిక జాబితా ప్రకారం 3,92,669 ఓటర్లు ఉన్నారు. సవరణల అనంతరం 6,976 మంది ఓటర్లను కొత్తగా చేర్చారు. 663 మందిని తుది జాబితా నుంచి తొలగించారు. కొత్తగా చేరిన వారిలో పురుషులు 3,415, మహిళలు 3,561 ఉన్నారు. తొలగించిన ఓట్లలో పురుషులు 336 మంది, మహిళలు 327 మంది ఉన్నారు. నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేశామని, 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బీఓల్‌ఓలు 407 మంది, సూపర్‌వైజర్లు 38 మందిని ఇప్పటికే నియమించినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: అక్టోబర్ 1 లేదా 2.. నవరాత్రి ఉపవాసం ముగించడానికి సరైన రోజు ఏదో తెలుసా?