Janwada Case: జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, వ్యాపారవేత్త విజయ్ మద్దూరి నిన్న మోకిల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. అతన్ని పోలీసులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.40 గంటల వరకు విచారించారు. ఈ కేసుకు సంబంధించి అతను ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేసిన పంపించారు. కాగా ఇటీవల కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీలో విజయ్ మద్దూరి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్దారించిన సంగతి తెలిసిందే. విజయ్ పై పలు సెక్షన్ల కింద నార్కోటిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : నందీశ్వరుల విగ్రహ తవ్వకాల్లో బిగ్ ట్విస్ట్.. అయోమయంలో గ్రామస్థులు
కేటీఆర్ బావమరిది ఇస్తేనే...
ఈ కేసుకు సంబంధించి పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయం బయటకు వచ్చింది. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల తనకు ఇస్తేనే డ్రగ్స్ తీసుకున్నట్లు విజయ్ మద్దూరి తెలిపినట్లు పోలీసులు FIR లో పేర్కొన్నారు. అయితే విజయ్ మద్దూరి పోలీసులు FIR లో పేర్కొన్న విషయాన్నీ ఖండించారు. కాగా నిన్న జరిగిన విచారణలో అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయి.. ఎవరు ఇచ్చారు.. ఎక్కడ నుంచి తెచుకున్నావ్ అనే అంశాలపై విజయ్ మద్దూరిని పోలీసులు ప్రశ్నలు కురిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పలు కీలక విషయాలను విజయ్ మద్దూరి నుంచి పోలీసులు లాగినట్లు సమాచారం.
Also Read : వైసీపీ సంచలన నిర్ణయం!
ఇదిలా ఉంటే గత నెల 26న అర్ధరాత్రి ఫాంహౌస్‌లో పోలీసులు సోదాలు చేసినప్పుడు విజయ్‌ని ఫోన్ ఇవ్వాలని కోరారు. కాగా విజయ్ తన
ఫోన్ కాకుండా వేరే మహిళా ఫోన్ ఇచ్చాడు. దీంతో ఈ విషయంపై పోలీసులు ప్రశ్నించగా.. తగిన మైకంలో అక్కడ టేబుల్ మీద ఉన్న ఫోన్ తనది అనుకోని ఇచ్చానని పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం తన వద్ద ఫోన్ లేదని.. పోయిన ఫోన్ కోసమే తాను కూడా వెతుకుతున్నట్లు పోలీసులకు విజయ్ మద్దూరి బదులిచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో మరోసారి విజయ్ మద్దూరిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.
Also Read : కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ
Also Read : యోగ టీచర్ నుంచి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి.. అనుష్క సినీ జర్నీ