నందీశ్వరుల విగ్రహ తవ్వకాల్లో బిగ్ ట్విస్ట్.. అయోమయంలో గ్రామస్థులు

నందీశ్వరుల విగ్రహ తవ్వకాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 48 గంటలు దాటినా గ్రామస్థులకు విగ్రహాల ఆచూకీ లభించలేదు. అటు దేవరల వద్దకు తీసుకెళ్లి బాలుడికి యంత్రం కట్టించడంతో పూనకం రాలేదని చెప్పడంతో గ్రామస్థులు తవ్వకాలు ఆపేయాశారు.

New Update

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కమలాపురం గ్రామంలో తనను పరమశివుడు ఆవహించాడంటూ అశోక్ (18) అనే బాలుడి వింత ప్రవర్తన చుట్టుపక్కల ప్రజలను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఊరిచివర ఓపుట్టలో తానున్నానని.. త్రవ్వి వెలికితీయాలంటూ అశోక్ గ్రామస్థులను కోరాడు. 

బిగ్ ట్విస్ట్..

తాను చూపించిన ప్రదేశంలో త్రవ్వకాలు జరిపితే నందీ, మహా శివలింగం బయటపడతాయని చెప్పడంతో గ్రామస్థులు తవ్వకాలు మొదలు పెట్టారు. అయితే తాజాగా ఈ విగ్రహ తవ్వకాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నందీశ్వర విగ్రహాల కోసం గ్రామస్థులు 48 గంటలకు పైగా తవ్వకాలు జరిపినా విగ్రహాల ఆచూకీ లభించలేదు.

Also Read : తెలంగాణలో దారుణం.. టీచర్ ప్రాణం తీసిన కోతి

మొదట శివలింగాన్ని బయటకు తీస్తేనే.. నంది ఆచూకీ లభిస్తుందని బాలుడు చెప్పగా.. అతని ప్రవర్తన తీరుతో కుటుంబసభ్యులు  ఆందోళన చెందారు. దాంతో బాలుడ్ని దేవరల వద్దకు తీసుకెళ్లి యంత్రం కట్టించారు. ఇకఅప్పటి నుంచి పూనకం రాలేదని, ప్రస్తుతం తాను సాధారణ స్థితికి వచ్చేశానని బాలుడు చెబుతున్నాడు.బాలుడ్ని పూనిన శివుడు వీడటంతో అయోమయంలో పడ్డ గ్రామస్తులు..నందీశ్వరుల కోసం తవ్వకాలు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read :యోగ టీచర్ నుంచి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి.. అనుష్క సినీ జర్నీ

Advertisment
Advertisment
తాజా కథనాలు