Arizona Plane Crashe: మరో ఘోర విమాన ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ - ఫొటోలు చూశారా?

అరిజోనాలో విమాన ప్రమాదం. నవజో నేషన్ వద్ద కూలిన మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ విమానంలో నలుగురు వైద్య సిబ్బంది మరణించారు. ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. FAA, NTSB దర్యాప్తు ప్రారంభించాయి.

New Update
Arizona Plane Crashe

Arizona Plane Crashe


అరిజోనాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అరిజోనాలోని నవజో నేషన్ సమీపంలో నిన్న (ఆగస్టు 5) ఒక వైద్య రవాణా విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం 12:40 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు వైద్య సిబ్బంది మరణించినట్లు అధికారులు తెలిపారు. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుంచి బయలుదేరిన CSI ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ విమానం.. చిన్లే మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Arizona Plane Crashe

ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. దీంతో అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలిగినట్లు సమాచారం. మరణించిన నలుగురిలో ముగ్గురు వైద్య సిబ్బంది, ఒక పేషెంట్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ పేషెంట్‌ను చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. ఈ విషాదంపై నవజో నేషన్ అధ్యక్షుడు బుయు నైగ్రెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘వీరు ఇతరుల ప్రాణాలను రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన వ్యక్తులు. వారి నష్టం నవజో నేషన్ అంతటా తీవ్రంగా కలచివేసింది’’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడి కానున్నాయి. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాద వాతావరణాన్ని నింపింది. 

Advertisment
తాజా కథనాలు