/rtv/media/media_files/2025/09/13/indiramma-sarees-2025-09-13-07-27-43.jpg)
Indiramma sarees
Indiramma sarees : మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఇందిరమ్మ చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందిరా మహిళా శక్తి స్కీం కింద మహిళా సంఘాల సభ్యులకు ఒక్కోక్కరికి ఒక చీర ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదట ఒక్కరికి రెండు చీరలు ఇవ్వాలని సంకల్పించినప్పటికీ ప్రస్తుతం దసరాకు ఒకటి, ఆ తర్వాత జనవరి నెలలో సంక్రాంతి నాటికి మరోకటి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సిరిసిల్ల నేతన్నలకు చీరల ఆర్డర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చింది. కాగా సిరిసిల్లా నేత కార్మికులకు ఏడాదంతా పని కల్పించాలన్న ఉద్దేశంతో 4.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి చేయాలని వారికి ఆర్డర్ ఇచ్చింది. కాగా గడచిన ఆరునెలలుగా సిరిసిల్ల నేత కార్మికులు ఇందిరమ్మ చీరలు సిద్ధం చేశారు. కాగా ఇప్పటి వరకు 35 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి పూర్తయింది. ఇప్పటివరకు 50 లక్షల చీరల ఉత్పత్తి పూర్తి అయింది. మరో 10 లక్షల చీరలు ప్రాసెసింగ్ లో ఉన్నాయి.. మరో 5 లక్షల చీరలు లూమ్స్ పై నుంచి ప్రొక్యూర్ స్టేజ్‌కు చేరుకున్నాయి.
Also Read : Faria Abdullah: దేవకన్యలా ముస్తాబైన ఫరియా.. ఫొటోలు చూస్తే.. వావ్ అనాల్సిందే!
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే సెర్ప్, మెప్మా సంస్థలు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశాయి. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ చేయడానికి సిద్ధమైంది. కాగా, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయా జిల్లాల్లో జిల్లా మంత్రులు చీరల పంపిణీని ప్రారంభిస్తారు. ఇప్పటికే పూర్తయిన చీరలను టెస్కో ఆఫీసర్లు ఆయా జిల్లాలకు పంపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర రావు, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తదితరులు చీరల డిజైన్‌ను ఎంపిక చేయగా, వాటి ఆధారంగా చీరలు సిద్ధం చేశారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఇచ్చే చీరలు లైట్ బ్లూ కలర్ తో.. డార్క్ బ్లూ బార్డర్‌తో తయారు చేశారు. బ్లూ కలర్ తో ఉన్నఈ చీరల మీద వైట్ కలర్ పుష్పాలను ముద్రించారు. కాగా, చీర బ్లౌజ్‌తో కలిపి 6.3 మీటర్లు ఉండనుంది. సీనియర్ సిటిజన్ మహిళలకు బ్లౌజ్ తో కలిపి 9 మీటర్ల చీర ఇవ్వనున్నారు. ఒక్కో చీర తయారీకి దాదాపు రూ.800 వరకు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. కాగా, ఈ నెల 23 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా చీరల పంపిణీ చేపట్టనున్నారు.
Also Read:సీబీఐకి ఫిర్యాదు చేస్తా.. BRS పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు