/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Winter-2-jpg.webp)
Telangana: తెలంగాణలో చలి తీవ్రత మరోసారి విపరీతంగా పెరిగింది. సంక్రాంతి సమయంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. సింగిల్ డిజిట్‌కే టెంపరేచర్లు పడిపోవటంతో చలితీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం 8 దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. అయితే రెండ్రోజుల క్రితం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి.
Also Read: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
చలి తీవ్రత తగ్గి వేడి వాతావరణం నెలకొంది. కానీ మళ్లీ చలిపులి పంజా విసురుతోంది. తెలంగాణలో శనివారం చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైదనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ఆ తర్వాత మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వరుసగా టెంపరేచర్లు 15.8 డిగ్రీలు, 17.2 డిగ్రీలకు పడిపోయినట్లు ప్రకటించారు.
Also Read: Supreme Court Judge: సుప్రీం కోర్టు జడ్జిల కాల్చివేత
సంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మంలోని పలు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. నల్గొండలో 17.4 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 18.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 19 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
15 డిగ్రీల కిందనే..
తెలంగాణలో నేడు కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 15 డిగ్రీల కిందనే టెంపరేచర్లు నమోదయ్యాయి. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మూడ్రోజుల పాటు పొగమంచు ఎక్కువగా ఉంటుందని.. రోడ్లపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు.
ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని తెలిపారు. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా.. 28 డిగ్రీల సెల్సియస్ 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతాయని చెప్పారు. ఉపరితల ఈశాన్య గాలులు గంటకు 4-8 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పారు.చలికాలం మరో నెల రోజులు ఉండటంతో ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చలి తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Also Read:Horoscope: నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు
Also Read: Nigeria: నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి!