/rtv/media/media_files/2025/01/17/x9a3UsbYPkXxoYZG7Zl7.webp)
Hyderabad Gun Fire News
Iran: ఇరాన్ లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపాడు. ఆ తరువాత తనని తానూ కాల్చి చంపుకున్నాడు. కోర్డు భవనంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. గతంలో ఆ జడ్జీలు అసమ్మతి వాదులకు సామూహిక ఉరిశిక్షలు విధించారనే కక్షతో ఈ పని చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: సైఫ్ అలీఖాన్ సెక్యూరిటీని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. విచారణలో విస్తుపోయే విషయాలు
శనివారం ఆ ‘చొరబాటుదారుడు’ హ్యాండ్‌గన్ పట్టుకొని సెంట్రల్ టెహ్రాన్‌లో ఉన్న ఇరాన్ సుప్రీంకోర్టులోకి ప్రవేశించాడు. సుప్రీంకోర్టు 39వ బ్రాంచ్ అధిపతి అయిన హొజ్జత్ అల్ ఇస్లాం అలీ రజిని (71), సుప్రీంకోర్టు 53వ బ్రాంచ్ అధిపతి హొజ్జత్ అల్ ఇస్లాం వల్ ముసల్మీన్ మహమ్మద్ మొఖిసెష్ (68)లను గురిపెట్టి కాల్పులు జరపగా వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఒక బాడీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు.
Also Read: Sheik Hasina: చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాం..అంతా 20 నిమిషాల్లోనే!
న్యాయమూర్తులైన మతాధికారులు మొహమ్మద్ మొఘైషే, అలీ రజినీలను కాల్చి చంపిన ఉదంతంలో ఏ గ్రూపు తామేనని చెప్పలేదు. ఇరాన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో వారి హత్య జరిగింది. ఈ ఇద్దరు జడ్జీలు ఇరాన్ సుప్రీం కోర్టులో పనిచేశారని ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది.
ప్రస్తుతం ఈ ఉదంతానికి సంబంధించిన దర్యాప్తు చేపట్టారు. ఈ ఉగ్రవాద చర్యకు కారణమైన వారిని గుర్తించి, అరెస్టు చేయడానికి దర్యాప్తును ముమ్మరం చేశారు.
Also Read: Chine Fake Jobs: ఉద్యోగం ఊడినా పరువు మాత్రం సేఫ్.. చైనాలో ఫేక్ జాబ్ ట్రెండ్!
Also Read: US Fire Accident: కాలిఫోర్నియాలోని అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ లో మంటలు!