/rtv/media/media_files/2024/12/17/UMFJHRyIpg9I44dN8qcC.jpg)
Telangana: తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గత వారం రోజులుగా.. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా జిల్లాల్లో 10 డిగ్రీలలోపే టెంపరేచర్ నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు పగలు, రాత్రి తేడా లేకుండా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: Ap Home Minister: ప్రభుత్వానికి నష్టం వస్తే నా పిల్లల్ని అయినా ఊరుకోను
రానున్న రోజుల్లో చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వారం క్రితం వరకు హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 17-30 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. ప్రస్తుతం 13 డిగ్రీలకు దిగువకు పడిపోయాయి.
Also Read: Syria: ప్రభుత్వ ఉద్యోగులకు 400 శాతం జీతాల పెంపు!
ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పారు. తూర్పు గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగాపెరిగిందని తెలిపారు.
ఉష్ణోగ్రతలు పడిపోయే..
జోగులాంబ, ములుగు, భద్రాద్రి, నల్గొండ, నాగర్‌కర్నూల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట,, సూర్యాపేట జిల్లాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందన్నారు. జనవరి 8 వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ ఉందని తెలిపారు. నగరంలోని ఆరు జోన్లు.. ఎల్బీ నగర్, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు ఉంటుందన్నారు.
ఉదయం ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య పరంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వివిధ రకాల వైరల్ వ్యాధులు, అలర్జీలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.
చాలామందిలో అలర్జిక్ రైనైటీస్ దాడి చేస్తోందని.. ముక్కు కారటం, తుమ్ములు, కళ్ల నుంచి నీరు కారటం, జలుబు, పొడి దగ్గు, దురద వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. ఫంగస్, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువులు, పుప్పొడి వంటివి ఆస్తమా సమస్యలను ప్రేరేపిస్తాయని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
Also Read: Hero Vishal: మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్..అసలేమైందంటే!
Also Read: Ap: తెల్లారే పింఛన్ ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా?