/rtv/media/media_files/2025/08/28/ias-smita-sabharwal-sensational-decision-2025-08-28-21-30-14.jpg)
IAS Smita Sabharwal's sensational decision
Smita Sabharwal : సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆమె 6 నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్‌లో వెళుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఆమె లీవులో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ కీలకంగా ఉన్నారు. ముఖ్యమంత్రి సలహాకమిటీలో సభ్యురాలిగా ఉండటంతో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత తగ్గింది.
Also Read: దేశంలో 20 ఫేక్ యూనివర్సిటీలు ... అవి కూడా నకిలీవే తెలుసా?
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ స్థానంలో కాత్యాయని దేవికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన స్మితకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇవ్వడంతో పాటు వరుస బదీలీలు చేస్తుండంతో స్మీతా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.మొదట రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా స్మితాకు పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత ఆమెను యువజనాభివృద్ధి, పర్యాటక & సంస్కృతి శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత తిరిగి మళ్లీ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ఇలా ప్రతిసారి బదిలీ చేస్తుండం పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: హైదరాబాద్‌లో మరికాసేపట్లో భారీ వర్షం..ఎవరు బయటకు రావొద్దు..IMD హెచ్చరిక
కాగా గతంలోHCU భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మితా ట్వీట్ చేశారు. ఈ విషయంలో అనేక విమర్శలు వచ్చాయి. స్మితాపై మిషన్ భగీరథ ప్రాజెక్టు విషయంలోనూ అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. స్మితా ఆరునెలల లీవు తర్వాత తిరిగి జాయిన్ అవుతారా లేదా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
Also Read: రాష్ట్రంలో కుంభవృష్టి.. సీఎం రేవంత్ ఏరియల్ పర్యటన