మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. దీంతో విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ ఎదుట జోషి బుధవారం బీఆర్‌కే భవనంలో హాజరయ్యారు. జోషితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్ కూడా హాజరు కాగా.. వీరిని కమిషన్ ప్రశ్నించింది. గత ప్రభుత్వం బ్యారేజీల నిర్మాణానికి లొకేషన్లు, నీటి లభ్యత వివరాలు, ఎలివేషన్, సొరంగాలు, కాలువలు వంటి అంశాల కోసం గూగుల్ మ్యాప్‌లు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు నాణ్యత, గేట్ల నిర్వహణలో లోపాలే కారణం.. మేడిగడ్డ వైఫల్యానికి కారణం ఏంటని కమిషన్ ప్రశ్నించగా.. సాంకేతిక నిపుణుడిని కాదని జోషి తెలిపారు. డిజైన్, ఆపరేషన్, నాణ్యత, గేట్ల నిర్వహణలో లోపాలే కారణం అయి ఉండవచ్చని జోషి అన్నారు. మేడిగడ్డ నుంచి నీరు మళ్లించడానికి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందా? లేదా? అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా.. సబ్ కమిటీ లేదని తెలిపారు. కేవలం సీఎం, మంత్రుల మధ్య జరిగిన సమావేశంలో మాత్రమే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ నిర్ణయం సీఎం తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమన్నారు. ప్రభుత్వం అంటే ఎవరని ఘోష్ ప్రశ్నించగా.. సీఎం, క్యాబినేట్ అని జోసి సమాధానమిచ్చారు. ఇది కూడా చూడండి: టాలీవుడ్‌లో విషాదం.. బలగం మొగిలయ్య ఇకలేరు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌ను ప్రశ్నించగా.. బ్యారేజ్‌లు సరిగ్గా నిర్వహించలేకపోవడానికి కారణం ప్రభుత్వ వైఫల్యాలే అని జస్టిస్ ఘోష్ రజత్ కుమార్‌ను ప్రశ్నించారు. దీనికి అతను సమాధానమిస్తూ.. మేడిగడ్డ బ్యారేజీల నిర్వహణ సరిగ్గా జరగలేదని తెలిపారు. అన్ని పనులు పూర్తయి, ప్రారంభోత్సవం సమయానికి అతను బాధ్యతలు చేపట్టినట్లు రజత్ కుమార్ తెలిపారు. ఇది కూడా చూడండి: BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత మేడిగడ్డ ఏడో బ్లాక్ కుంగడానికి కారణం ఏంటని ప్రశ్నించగా.. రివర్‌బెడ్ కింద పునాదుల నుంచి ఇసుక కొట్టుకుపోవడం లేదా బ్యారేజీ వద్ద ప్రవాహవేగం ఎక్కువగా రావడం వల్ల కూడా అయి ఉంటుందని రజత్‌కుమార్ అన్నారు. ఒప్పందం ప్రకారం పని పూర్తయిన తర్వాత ఏజెన్సీకి నిర్వహణ బాధ్యత ఉంటుంది. ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. దీంతో రజత్ కుమార్.. కాంక్రీట్ దెబ్బతింటే అధ్యయనం చేయాలని, చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు సూచించామన్నారు. వరుసగా వరదలు వచ్చిన కూడా ఏం కాలేదన్నారు. ఇది కూడా చూడండి: హైదరాబాద్ బుక్ ఫెయిర్.. నేటి నుంచే ప్రారంభం