కాంట్రవర్సికి కేరాఫ్.. ఆమ్రాపాలికి ఎందుకంతా క్రేజ్ IAS ఆఫీసర్ ఆమ్రపాలి ఏం చేసినా అది సంచలనమే. ప్రస్తుతం GHMC కమిషనర్‌గా దూకుడు కనబరుస్తున్న ఆమెను ఏపీకి రిపోర్టు చేసుకోవాలని కేంద్రం ఆదేశించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఇది రేవంత్ సర్కార్‌కు కాస్త ఇబ్బంది పెట్టే విషయంగానే అనిపిస్తోంది. By B Aravind 11 Oct 2024 in తెలంగాణ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి 'గతంలో పనిచేసిన కలెక్టర్లు ఈ భవనం మొదటి అంతస్తులో దెయ్యం ఉందని నాతో చెప్పారు.. అందుకే ఆ గదిలో పడుకోవడానికి నేను సాహసించలేను..' 2018 ఆగస్టులో వరంగల్ కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం గురించి నాడు అదే జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న IAS ఆఫీసర్ ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలివి. ఈ కామెంట్స్ అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి అమ్రపాలి ఏం చేసినా అది సంచలనమే.. అది చర్చనీయాంశమే.. ఏం మాట్లాడినా అది రచ్చే..! ఇక ప్రస్తుతం GHMC కమిషనర్‌గా దూకుడు కనబరుస్తున్న అమ్రపాలితో పాటు మరికొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లను అనూహ్యంగా ఏపీకి రిపోర్టు చేసుకోవాలని కేంద్రం డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ లెక్కన ఆమ్రపాలి ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది రేవంత్ సర్కార్‌కు కాస్త ఇబ్బంది పెట్టే విషయంగానే అనిపిస్తోంది. ఆమ్రపాలి 1982, నవంబరు 4న ఏపీలోని విశాఖపట్నంలో కాట వెంకట్ రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర బోధకుడిగా పనిచేశారు. ఆమె స్కూలింగ్ అంతా విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్‌లో జరిగింది. తర్వాత ఆమె చెన్నైలోని ఐఐటి మద్రాస్ నుంచి ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత IIM బెంగుళూరు నుంచి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్-ఇండియా 39వ ర్యాంక్‌ను సాధించి, ఐఏఎస్‌కు ఎంపికైన అతి పిన్నవయస్కుల్లో ఒకరిగా నిలిచారు. Also read: యుద్ధాల నుంచి రక్షణ కోసం అణు బంకర్లకు పెరుగుతున్న డిమాండ్.. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి యంగ్ డైనమిక్ ఆఫీసర్‌గా తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్నారు. ముందుగా ఆమె కెరీర్ వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేశారు. 2015లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, ఆ తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఇక 2020లో ఆమ్రపాలి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. డిప్యుటేషన్ పూర్తి చేసిన తర్వాత మళ్లీ తెలంగాణ సర్వీసుల్లో చేరి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అటు ఆమ్రపాలి కెరీర్‌లో ఎన్నో ఘనతలు ఉన్నట్టే పలు సార్లు ఆమె విమర్శలపాలైన సందర్భాలూ ఉన్నాయి. 2018లో వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆమె అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. నాటి గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో తెలుగులో కొన్ని పదాలు ఉచ్చరించలేక పగలబడి నవ్వారు. ఇక రాష్ట్ర బహిరంగ మలవిసర్జన రహిత పథకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె నవ్వకుండా ఉండలేకపోయారు. 'మరుగుదొడ్లు' అని ఉచ్చరిస్తున్నప్పుడు రెండుసార్లు నవ్వారు. 2017లో, ఆమె తన సిబ్బందికి బాహుబలి-2 సినిమా చూసేందుకు వీలుగా మొత్తం థియేటర్‌ని బుక్ చేశారు. టిక్కెట్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని పిటిషనర్ ఆరోపించడంతో ఆమె న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. Also Read: ఫైరింగ్ ప్రాక్టీస్‌లో విషాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి ఇక ఇటీవల తెలంగాణలో కాక రేపిన హైడ్రా విషయంలో కూడా ఆమ్రపాలి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. మొదట్లో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు జీహెచ్ఎంసీలో పనిచేసే కొంత మంది విజిలెన్స్ సిబ్బందిని హైడ్రా కోసం కేటాయించడం వివాదానికి కారణమైంది. జీహెచ్ఎంసీ నుంచి కేటాయించిన విజిలెన్స్ అధికారులను తిరిగి తమ శాఖకు పంపించాలని హైడ్రా నుంచి రిలీవ్ చేయాలని ఆమె హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు లేఖ రాయడం సంచలనం రేపింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆమెను ఏపీకి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఎందుకంటే యూపీఎస్సీ అప్లికేషన్‌లో ఆమ్రపాలీ పర్మినెంట్ అడ్రస్ విశాఖగా ఉంది. #telugu-news #telangana #amrapali మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి