యుద్ధాల నుంచి రక్షణ కోసం అణు బంకర్లకు పెరుగుతున్న డిమాండ్..

యుద్ధాల నుంచి సురక్షితంగా బయటపడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అణు బంకర్ల నిర్మాణం మొదలైంది. బహుళ అంతస్తుల భవనాల కింద ఈ అణు బంకర్లను నిర్మిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

New Update
war and bunker

రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ సహా వివిధ దేశాల్లో యుద్ధాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు ఏ దేశంలో బాంబు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత్‌తో సహా అనేక దేశాలు యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు తమ రక్షణ వ్యవస్థను బలపరుచుకుంటున్నాయి. అణు ఆయుధాలను సైతం సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే ఏ ప్రాంతంలో, ఎవరు చనిపోతారనే విషయాన్ని ఎవరూ ఊహించలేరు. యుద్ధం నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే బంకర్లకు వెళ్లి దాక్కోవాల్సిందే. కానీ ఇలాంటి బంకర్లు ఆయా దేశాల్లో అతి తక్కువగా మాత్రమే ఉంటాయి.

బహుళ అంతస్తుల కింద బంకర్లు

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అణు బంకర్ల నిర్మాణం మొదలైంది. బహుళ అంతస్తుల భవనాల కింద ఈ అణు బంకర్లను నిర్మిస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అనేక కంపెనీలు భూగర్భ CBRNని విక్రయిస్తున్నాయి. అంటే రసాయన, జీవ, రేడియోలాజికల్ న్యూక్లియర్ బంకర్‌లు. ఇలాంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇప్పుడు ఢిల్లీకి కూడా వచ్చేశాయి. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాల కింద ఈ బంకర్లు నిర్మిస్తున్నారు. వీటి ధర ఒకటిన్నర నుంచి పదుల కోట్ల వరకు ఉంటుంది. కానీ దేశంపై యుద్ధం జరిగినప్పుడు ఆ బంకర్లోకి వెళ్లి కొన్నిరోజుల పాటు సురక్షితంగా ఉండొచ్చు. 

Also Read: టాటా గ్రూప్స్ వారసుడొచ్చేశాడు.. నోయెల్ టాటా గురించి ఆసక్తికర విషయాలు

అంతేకాదు, దొంగల గంపు వచ్చినప్పుడు, ఉగ్రదాడుల జరిగినప్పుడు కూడా ఈ బంకర్లోకి వెళ్లి సురక్షితంగా ఉండొచ్చు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఇళ్లలో ఇలాంటి వాటికి చాలా డిమాండ్ ఉంటుంది.  హోటల్ గదుల్లాగే బంకర్లు కూడా ఉంటాయి. ఇందులో మీరు ఎంతమందికి వసతి కల్పిస్తారనేదానిపై కూడా ధర కూడా మారుతుంది. సాధారణంగా ఓ గదిలో ఇద్దరు పెద్దలు, ఒక బిడ్డకు ఒక నెలరోజుల పాటు వసతి కల్పిస్తుంది. ఆ స్థలంలో ఆహారం, నీరు చాలా రోజుల వరకు నిల్వ చేయబడతాయి. మరికొన్ని ఇళ్లల్లో ఎనిమిది మంది దాదాపు 300 రోజుల పాటు తలదాచుకునే బంకర్లు ఉంటాయి.  

బయట ఏం జరిగినా బంకర్లో సేఫ్

ఇక అత్యంత ప్రీమియం నాణ్యత గల బంకర్లు విలాసవంతమైన భవనం వలె విస్తరించి ఉంది. మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంకర్‌లో 17 లేదా 18 మంది ఉండొచ్చు. ఇక్కడ ఏడాది నుంచి మూడేళ్ల వరకు సరిపోయేంత ఆహారం, నీరు, విద్యుత్‌ అందుబాటులో ఉంటాయి. కూరగాయల కొరత ఉంటే లేదా తాజా ఆహారం తినాలని మీరు భావించినా దీనికి కూడా ఓ సదుపాయం ఉంది. బంకర్ లోపల ఒక హైడ్రోపోనిక్ గది ఉంటుంది. ఇక్కడ పండ్లు, మొక్కలను పెంచవచ్చు. బయట ఎక్కువ ప్రమాదం జరిగినా, యుద్ధం ఎక్కువ కాలం కొనసాగినా, గ్లోబల్ వార్మింగ్ విధ్వంసం సృష్టించినా, లోపల బంకర్లో ఉండే ఈ ప్రజలు మాత్రం బ్రతకగలుగుతారు.
 
అంతేకాదు ఈ బంకర్లో ఆయుధ గది కూడా ఉంటుంది. యుద్ధం ఒక కొలిక్కి వచ్చి.. బయటకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడితే బంకర్ నివాసితులను కంపెనీ అలెర్ట్ చేస్తుంది. 2021లో మొదటిసారిగా ఓ కంపెనీ బంకర్‌ను విక్రయించింది. గత మూడు ఏళ్లలో CBRN (కెమికల్-బయోలాజికల్-రేడియోలాజికల్-న్యూక్లియర్) షెల్టర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. భారత్‌లో సాధారణ పౌరులకు ఈ బంకర్ల ధర రూ.1.2 కోట్ల నుంచి ప్రారంభమవుతోందని తెలుస్తోంది. ఇంకా ఎక్కువ మంది రక్షణ పొందాలనుకుంటే ధర పెరుగుతుంది. ఈ బంకర్లను నిర్మించడం ఇంకా కొనసాగుతోంది. ఇక విదేశాల్లో అయితే ఈ బంకర్ల నిర్మాణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

Also Read: ఉచిత హామీలు అమెరికా దాకా వెళ్లాయి: కేజ్రీవాల్ ఆసక్తికర పోస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు