ఫైరింగ్ ప్రాక్టీస్‌లో విషాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి మహారాష్ట్రలోని నాసిక్‌లో తీవ్ర విషాదం జరిగింది. ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలో షెల్ మిస్ ఫైర్ అవడంతో గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్(21) అనే అగ్నివీరులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. By Seetha Ram 11 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్రలోని నాసిక్‌లో తీవ్ర విషాదం జరిగింది. ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో షెల్ పేలి ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు విడిచారు. నాసిక్ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్‌లో గురువారం మధ్యాహ్నం ఈ విషాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చదవండి: బతుకమ్మ సంబరాల్లో విషాదం.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి మిస్ ఫైర్ కారణంగా మృతి నాసిక్ రోడ్డులోని ఆర్టిలరీ సెంటర్‌లో అగ్నివీరుల బృందం ఫీల్డ్ గన్‌తో ఫైరింగ్ చేస్తుంది. అందులోని ఒక షెల్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21)లను వెంటనే దియోలలీలోని మిలటరీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే వారిద్దరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇది కూడా చదవండి: విషాదం.. భర్త, ఇద్దరు కుమారుల మృతి.. ‘మీరు లేని జీవితం నాకొద్దు’ కాగా వీటిని ప్రమాదవశాత్తు మరణాలుగా కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే కొందరు అగ్నివీరులు మరణించారు. రాజస్థాన్‌లోని భరత్ పూర్‌లో మాక్ డ్రిల్ సమయంలో జరిగిన పేలుడులో ఒక అగ్నివీర్ మరణించాడు. ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు అలాగే సేవార్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్‌పుర ఆర్మీ శిక్షణ కేంద్రంలో కూడా అగ్నివీరులు మాక్ డ్రిల్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఇందులో సౌరభ పాల్ అనే అగ్నివీరుడు చనిపోయాడు. #maharastra #firing #agniveer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి