HYDRA: హైదరాబాద్ లో మరోసారి హైడ్రా పేరు తెర మీదకు వచ్చింది. రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు షురూ అయ్యాయి. శాస్త్రీపురంలో ఫుట్‌పాత్‌లపై కట్టడాలను GHMC అధికారులు కూల్చివేస్తున్నారు. 100 మంది పోలీస్ బందోబస్తు తో కూల్చివేతల పర్వం నిర్వహిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఫుట్ పాత్, రోడ్లలను వ్యాపారులు కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఫుట్ పాత్ కబ్జాతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది.
Also Read: Vivian Jenna Wilson: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన
Also Read: Brazil: విమానాశ్రయంలో కాల్పులు...ఒకరి మృతి!
హిమాయత్ సాగర్ ప్రాంతంపై ఫోకస్..
తాజాగా హైడ్రా అధికారులు హిమాయత్ సాగర్ ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. హిమాయత్ సాగర్ జలాశయం బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా సర్వే చేయాలని హైడ్రా నిర్ణయించింది. 2010 నుంచి 2024 వరకు హిమాయత్ సాగర్ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉస్మాన్ సాగర్‌పై దృష్టి పెట్టేలా హైడ్రా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తుండగా.. రెండో విడతగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని 549 చెరువులకు హైడ్రా సర్వే చేపట్టనుంది. అందుకు అనుగుణంగా FTL, బఫర్ జోన్ గుర్తించేందుకు 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ సైతం జారీ చేశారు.
Also Read: Mallareddy: మల్లారెడ్డితో పాటు ఆ 12 మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్!
ఇక ప్రతి చెరువుకు జియో ట్యాగింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చెరువులు, కుంటలను ఎవరూ ఆక్రమించకుండా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పక్కాగా లెక్కలు సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ సర్వేల సహాయంతో చెరువుల విస్తీర్ణాన్ని, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ను డిసైడ్ చేసి.. వాటికి జియో ట్యాగింగ్ చేసి హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అలాగే కూకట్‌పల్లిలో హైడ్రా అధికారులు కూల్చివేతలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read: సమగ్ర సర్వేపై సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఎక్కడ ఉంటే అక్కడే!