Hydra: పర్మిషన్ లేని హోర్టింగ్‌లను కూల్చేస్తున్న హైడ్రా..

పర్మిషన్ లేని హోర్టింగ్‌లపై కూడా తాజాగా హైడ్రా దృష్టి సారించింది. శంషాబాద్‌, కొత్వాల్‌గూడ, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు,తెల్లాపూర్‌, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఇప్పటిదాకా 53 భారీ హోర్డింగ్‌లను హైడ్రా సిబ్బంది తొలిగించారు.

New Update
Hydra Demolishing Hoardings

Hydra Demolishing Hoardings

ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్ధరించేందుకు హైడ్రా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పర్మిషన్ లేని హోర్టింగ్‌లపై కూడా దృష్టి సారించింది. శంషాబాద్‌, కొత్వాల్‌గూడ, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు,తెల్లాపూర్‌, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఇప్పటిదాకా 53 భారీ హోర్డింగ్‌లను హైడ్రా సిబ్బంది తొలిగించారు. మరోవైపు యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో కూడా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ భేటీ అయ్యారు. పర్మిషన్ లేకుండా హోర్టింగ్‌లు పెడితే వాటిని తొలగిస్తామంటూ రంగనాథ్‌ హెచ్చరించారు.    

Also Read: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి

మరోవైపు మేడ్చల్‌ జిల్లాలోని కోమటికుంట చెరువులో కూడా చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేసింది. ఇదిలాఉండగా చెరువుల FTL పరిధిలో కూడా అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు చర్యలు తీసుకుంటున్నాయి. మొన్నటివరకు చిన్న చిన్న రేకులు, షెడ్లను హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దేవరయంజాల్‌ గ్రామంలో కోమటికుంట చెరువు FTL పరిధిలో నిర్మించిన రిసార్టులు, కన్వెన్షన్లు నేలమట్టం చేసింది. ఎలాంటి పర్మిషన్ లేకుండానే నిర్మాణాలు చేపట్టినట్లు దేవరయంజాల్‌ గ్రామస్థులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే హైడ్రా మున్సిపాలిటీ అధికారులతో విచారణ చేసి రిసార్ట్స్‌ ఓనర్లకు నోటీసులు ఇచ్చింది. 

Also Read:  ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్‌!

Advertisment
తాజా కథనాలు