/rtv/media/media_files/2025/04/05/QEDISmhHHBJZysCl4hIK.jpg)
wines closed
మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. 2025 ఏప్రిల్ 06వ తేదీ ఆదివారం రోజున శ్రీరామనవమి సందర్భంగా వైన్ షాపులు బంద్ చేయాలని రాచకోండ పోలీస్ కమిషనర్ రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే
దీని పరిధిలోకి కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఎల్లుండి ఉదయం వైన్ షాపులు ఓపెన్ కానున్నాయి. మరోవైపు శోభా యాత్ర సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మల్లింపులు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
కనుల పండువగా ధ్వజారోహణం
మరోవైపు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం కనుల పండువగా జరిగింది. ఈ వేడుక భక్తి ప్రపత్తులతో భక్తుల జయజయధ్వానాల మధ్య ఉత్సవమూర్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా ప్రధానాలయం నుంచి వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలతో సీతారామలక్ష్మణ స్వామితో ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ధ్వజస్తంభంపై గరుత్మంతుడు ఉత్సవాలు అయ్యే వరకు కాపు కాస్తాడని ప్రతీతి. ఇది బ్రహ్మోత్సవా ల్లో ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో త్రిదండి దేవనాదజీయర్ స్వామీజీ, ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Follow Us