HCU: కంచ గచ్చిబౌలీ వివాదం..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్ హైచ్ సీయూ కంచ గచ్చిబౌలీ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలతో కూడిన మంత్రులను కమిటీని నియమించింది. 

New Update
revanth

CM Revanth Reddy

హైదరబాబ్ సెంట్రల్ యూనివర్శిటీ కంచ గచ్చిబౌలీ వివాదంపై వరుసగా హైకోర్టు, సుప్రీంకోర్టులు సీరియస్ అయ్యాయి. HCU భూవివాదంపై దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టులో విచారించింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చురకలు అంటించింది. జస్టిస్ గవాయ్ రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ లపై ప్రశ్నల వర్షం కురింపించారు. 400 వందల ఎకరాల భూవివాదంపై నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని కోరింది. మరోవైపు హైకోర్టు కూడా ఏప్రిల్ 7 వరకూ యూనివర్శిటీ భూమిలో చెట్లు కొట్టకూడదని ఆదేశించింది. ఈ పిటిషన్‌లో ప్రతివాదులకు నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. చెట్లు నరకొద్దని స్టే ఉన్న.. 400 ఎకరాల్లో చెట్లు తొలగిస్తున్నట్లు పిటిషనర్ తరపు న్యాయవాది ఆధారాలు కోర్టుకు చూపించారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ప్రభుత్వం విక్రయించకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. 

ప్రభుత్వం కీలక నిర్ణయం..

దీంతో ఈ విషయంపై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంచ గచ్చిబౌలీ భూ వివాదంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజాసంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది.

 

today-latest-news-in-telugu | ts-government | hcu 400 acres issue 

Also Read:  USA: వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్..పెద్ద కంపెనీలన్నీ ఢమాల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు