Transgenders For Traffic Control:
సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు వినియోగించుకోవాలని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ విధంగా ట్రాన్స్ జెండర్లను ట్రైన్ చేఆలని అధికారులను ఆదేశించారు. నగరంలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా తాగి వాహనాలు నడిపే వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు. వారికి హోమ్ గార్డ్ తరహాలో జీత భత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, ప్రత్యేక డ్రెస్ కోడ్ ను రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం అదేశించారు.
Also Read: Karnataka: గ్రీన్ సెస్ దిశగా కర్ణాటక ప్రభుత్వం–బీజేపీ ఆరోపణ
Also Read: గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం!