Karnataka: గ్రీన్ సెస్ దిశగా కర్ణాటక ప్రభుత్వం–బీజేపీ ఆరోపణ కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ఇప్పుడు కష్టమైపోతోంది. అందుకే కొత్త పన్నులు విధించడానికి ఆ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రీన్ సెస్ ముసాయిదాను తీసుకువస్తారని బీజేపీ ఆరోపిస్తోంది. By Manogna alamuru 14 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Karnataka Government: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తోచిన హామీలన్నీ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ హామీల వల్ల విపరీతమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో దీన్ని అదుపులోకి పెట్టేందుకు చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కొత్త పన్నులు విధించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ధిక బాగు కోసం కర్ణాటక సర్కార్ ప్రతిపాదించిన గ్రీన్ సెస్ ముసాయిదా రూపొందించకముందే రాజకీయంగా కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది. అక్కడి ప్రతిపక్ష బీజేపీ ఈ విషయాన్ని రాజకీయం చేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. పశ్చిమ కనుమల్లో పట్టే నదుల నీటిని వినియోగించుకునే కర్ణాటక నగరాల్లో నీటి బిల్లులపై రూ. 2 నుంచి రూ. 3 వసూలు చేస్తారు. దీనిని సాగనివ్వకూడదని బీజేపీ చూస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీ పథకాల కారనంగా ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం రహస్యంగా ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. దాని కోసమ గ్రీన్ సెస్ ను తీసుకువస్తున్నారని అంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. తన మొదటి బడ్జెట్‌లోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 2023 రాష్ట్ర బడ్జెట్‌లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)పై 20% ఎక్సైజ్ సుంకాన్ని మరియు బీర్ ధరలపై 10% పెరుగుదలను ప్రకటించింది. అది కాక తరువాత క్యాబ్‌లు, ఆటో, రిక్షాలతో సహా కొత్తగా నమోదు చేసుకున్న వాణిజ్య రవాణా వాహనాలపై రవాణా సెస్‌లో 3% పెంపును ప్రకటించారు. ఇప్పుడు నీటి మీద కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించింది. మరోవైపు ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొనేందుకు.. ఆదాయ ఉత్పత్తిని మెరుగుపరచడం, ఆర్థిక లీక్‌లను అరికట్టడం కోసం కర్ణాటక ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో.. మార్గదర్శకత్వం కోసం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)ని నియమించుకుంది. ఇదో పెద్ద అనవరమైన ర్యల అని అంటున్నాయి అక్కడి ప్రతిపక్షాలు. కన్సల్టెన్సీకి రూ. 9.5 కోట్ల రుసుము చెల్లించగలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం..హామీలను మాత్రం నెరవేర్చలేదా అంటూ బిజెపి విమర్శించింది. అయితే మరోవైపు నిధుల కొరత ఆరోపణల్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. రాష్ట్రంలో అభివృద్ధి నిధులకు కొరత లేదని, బీజేపీ ప్రజలకు అబద్ధాలు చెబుతోందని, ఐదు హామీ పథకాల అమలును సాకుగా చూపుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అసత్యాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి