SA:గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం!

మూసివేసిన బంగారు గనిలోకి అక్రమంగా వెళ్లిన 4 వేల మంది చిన్నారులు లోపల చిక్కుకుపోయారు. అయితే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంది. గనిలో చిక్కుకుపోయిన చిన్నారులను కాపాడే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పింది.

New Update
gold

GOld Mines: అక్రమ మైనింగ్‌ కి పాల్పడుతున్న చిన్నారుల పట్ల సౌత్‌ ఆఫ్రికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మూసేసిన గనిలోకి ప్రవేశించిన వేలాది మంది మైనర్లు..అందులోనే ఇరుక్కుపోయారు.అయితే వారిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడేదే లేదని దక్షిణాఫ్రికా తేల్చి చెప్పింది. అంతేకాకుండా వారిని బయటికి కూడా రానీయకుండా చేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. 

Also Read:TS:హోమ్‌ గార్డులుగా ట్రాన్స్ జెండర్లు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

 ఇక వారికి అందులోకి నిత్యావసర వస్తువులను కూడా అందించడం లేదు. దీంతో గనిలో చిక్కుకుపోయిన వేలాది మంది చిన్నారుల పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గతంలో ఆ బంగారు గనిలోకి వెళ్లిన చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురి కాగా.. ప్రస్తుతం అందులో 4 వేల మంది చిన్నారులు ఉండటంతో వారు ఎలా ఉన్నారో అనే ఆవేదన తీవ్రం అవుతోంది.

Also Read: Karnataka: గ్రీన్ సెస్ దిశగా కర్ణాటక ప్రభుత్వం‌‌–బీజేపీ ఆరోపణ

దక్షిణాఫ్రికాలోని వాయవ్య ప్రాంతంలో మూసివేసి ఉన్న బంగారు గనిలోకి దాదాపు 4000 మంది మైనర్లు అక్రమంగా ప్రవేశించినట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అయితే మూసివేసిన ఆ గనిలో ఏదైనా బంగారం దొరుకుతుందేమో అని.. అందులోకి వెళ్లిన చిన్నారులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. బంగారం దొరకడం సంగతి పక్కనపెడితే.. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది.

Also Read: దారుణం.. పోలింగ్ తర్వాత దళితుల ఇళ్లకు నిప్పు

ఇక ఆ గనిలో ఉండిపోయిన వారిని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం అస్సలు ఎలాంటి సహాయక చర్యలు అనుమతించడం లేదు. అంతేకాకుండా వారు బయటకు రాకుండా గని ద్వారాలను కూడా మూసేసింది. చిన్నారులకు నిత్యావసరాలను అందించకుండా కఠిన చర్యలకు దిగినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.

Also Read: ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏం సాధించారు.. అమిత్ షాపై కాంగ్రెస్‌

గని ద్వారాలు మూసేసి...

బంగారు గని మూసివేయగా.. అందులో ఏమైనా మిగిలిన బంగారం దొరుకుతుందేమోనని కొద్ది రోజుల క్రితం వేలాది మంది చిన్నారులు గనిలోకి ప్రవేశించినట్లు సమాచారం. అలా వెళ్లిన వారంతా అ గనిలోనే ఉండిపోయారు. అయితే గనిలోకి చిన్నారులు వెళ్లిన ఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వం వారి పట్ల కఠిన చర్యలకు ఉపక్రమించింది. వారంతా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్న ప్రభుత్వం.. గని ద్వారాలు మూసేసి లోపల ఉన్న మైనర్లకు ఆహారం, నిత్యవసరాలను అందించకూడదంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే గని నుంచి బయటికి వచ్చే చిన్నారుల కోసం ‘క్లోజ్‌ది హోల్‌’ ఆపరేషన్‌ను చేపట్టింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారులు బయటికి వస్తే వారిని అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గని ప్రాంతంలో భారీగా పోలీసు సిబ్బంది మోహరించింది. లోపల ఉన్న వారిని బయటికు తీసుకొచ్చేందుకు సాయపడుతున్న ముగ్గురు వ్యక్తుల నుంచి తమకు సమాచారం వచ్చినట్లు ఓ  పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. 

దాదాపు 4 వేల మంది మైనర్లు గని లోపల ఉన్నారని.. కొన్ని రోజుల క్రితం వివిధ గనుల వద్ద వందల సంఖ్యలో మైనర్లు కనిపించినట్లు అధికారులు తెలిపారు. గని లోపలికి ప్రవేశించిన  వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యారని.. ఒకవేళ ఎవరైనా బయటకి వస్తే కనుక వారిని వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు అధిక సంఖ్యలో సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 

 అక్రమంగా గనిలోకి ప్రవేశించిన మైనర్లకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయదని అధికారులు పేర్కొన్నారు. నేరస్థులను కాపాడేందుకు సిద్ధంగా లేదని.. ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ఈ చర్యలు తప్పవని కేబినెట్‌ మంత్రి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు