HYD: హైదరాబాద్-ఫ్రాంక్ ఫ్టర్ లుఫ్తాన్సా విమానానికి తప్పిన ఘోర ప్రమాదం..

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు చాలా ఎక్కువగానే భయపెడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి ఫ్రాక్ ఫర్ట్ వెళుతున్న లుఫ్తాన్సా ఫ్లైట్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విమానం టైరులో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ వెంటనే ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

New Update
flight

Lufthansa Flight

హైదరాబాద్ నుంచి ప్రాంక్ ఫర్ట్ కు 160 మంది ప్రయాణికులతో లుఫ్తాన్సా విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిపేటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టైరులో ఈ లోపాన్ని గుర్తించారు పైలెట్. అది కూడా ముందు టైరులో. దీంతో పైలెట్ వెంటనే అప్రమత్తమై రన్ వే పై విమానాన్ని దించేశారు. దీంతో ఘోర ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. ఇందులో మొత్తం 160 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

today-latest-news-in-telugu | flight | hyderabad | technical-glitches 

Also Read: Mumbai: ముంబైని ముంచెత్తిన వానలు..రోడ్లన్నీవరద మయం

Advertisment
తాజా కథనాలు