/rtv/media/media_files/2024/11/18/ul3qUj9dlgIrBJWQ2xL4.jpg)
పుష్ఫ–2 రిలీజ్ అయిన వెంటనే చూడాలనుకునే వారికి షాక్ ఇస్తున్నాయి థియేటర్ యాజమానాయాలు. ధరలను విపరీతంగా పెంచేసి అమ్ముతున్నాయి. ఏపీలో పుష్ప–2 సినిమా టికెట్ల ధరల పెంపుకు గవర్నమెంటు అనుమతినిచ్చింది. దీంతో డిసెంబర్ 4న రాత్రి 9.30కు ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధర మీద ఏకంగా రూ. 800 పెంచే అవకాశం కలిగింది. దాంతో పాటూ డిసెంబర్ 5 నుంచి 17వరకు రెండు వారాలపాటూ గరిష్టంగా 200రూ. వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇక మల్టీప్లెక్సులలో రూ.200, సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్‌కు రూ.100, అప్పర్ క్లాస్‌కు రూ.150 వరకు ధరలు పెంచుకోవచ్చును. ఈ లెక్క ప్రకారం చూస్తే మొదటి రెండు వారాల్లో సినిమా చూడాలనుకునేవారు ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టాలని అర్ధం అవుతోంది.
స్పెషల్ థాంక్స్..
మరోవైపు ఏపీలో టికెట్ ధరలను పెంచుకునే అవకాశం ఇచ్చినందుకు పుష్ప–2 హీరో అల్లు అర్జున్ గవర్నమెంట్‌కు తన కృతజ్ఞతలు తెలియజేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెరుగుదలకు ఇది ఎంతో తోడ్పడుతుందని అన్నాడు. ఇండస్ట్రీ బాగు కోసం ఆలోచించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు స్పెషల్ థాంక్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు బన్నీ.
Also Read: Earth Orbit: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస